Fire Boltt: ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లా.. ఫైర్ బోల్ట్ నుంచి మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లు.
ఇటీవల వరుసగా స్మార్ట్ వాచ్‌లను తీసుకొస్తోంది ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫైర్ బోల్ట్. ఇప్పటికే పలు స్మార్ట్ వాచ్‌లను పరిచయం చేసిన ఫైర్ బోల్ట్ తాజాగా మార్కెట్లోకి మరో రెండు కొత్త వాచ్‌లను తీసుకొచ్చింది. ఫైర్‌బోల్ట్ డాజర్, ఫైర్‌బోల్ట్ స్టార్‌డస్ట్ పేర్లతో..

ఇటీవల వరుసగా స్మార్ట్ వాచ్‌లను తీసుకొస్తోంది ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫైర్ బోల్ట్. ఇప్పటికే పలు స్మార్ట్ వాచ్‌లను పరిచయం చేసిన ఫైర్ బోల్ట్ తాజాగా మార్కెట్లోకి మరో రెండు కొత్త వాచ్‌లను తీసుకొచ్చింది. ఫైర్‌బోల్ట్ డాజర్, ఫైర్‌బోల్ట్ స్టార్‌డస్ట్ పేర్లతో ఈ వాచ్‌లను లాంచ్ చేసింది. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఫైర్ బోల్ట్ డాజర్ ఫీచర్లు..
ఈ స్మార్ట్ వాచ్‌లో 1.43 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్, కాల్ హిస్టరీ, క్విక్ డైయిల్ పాడ్, సింక్ కంటాక్ట్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఇందులో 400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు, 15 రోజులపాటు స్టాండ్‌బైతో పని చేస్తుంది. 108 స్పోర్ట్స్ మోడ్స్‌తో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో వాయిస్ అసిస్టెంట్, స్లీప్, ఎస్‌పీఓ2, హార్ట్ రేట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఇక ఇందులో ఇన్‌బుల్ట్‌గా మైక్, స్పీకర్‌ను అందించిన ఈ వాచ్‌లో ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. ధర విషయానికొస్తే ఫైర్ బోల్ట్ డాజర్ రూ. 3,499 వద్ద అందుబాటులో ఉంది.
ఫైర్ బోల్ట్ స్టార్‌డస్ట్ ఫీచర్లు..
ఫైర్ బోల్ట్ స్టార్‌డస్ట్ స్మార్ట్ వాచ్‌లో 1.95 ఇంచెస్ హెచ్‌డీ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ 5.0తో పని చేసే ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, కాల్ హిస్టరీ, క్విక్ డయిల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్స్ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌తో కూడిన ఈ వాచ్‌లో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌ను అందించారు. 5 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. ఇక ఈ వాచ్ ధర విషయానికొస్తే రూ. 2499కి అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..