AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo New Phone: సూపర్ నైట్ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఇక ఫొటో లవర్స్‌కు పండగే.. ధర ఎంతో తెలుసా?

ఫొటో లవర్స్ నైట్ టైమ్ ఫొటోస్ తీసుకోడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎంత రేట్ పెట్టి కొన్న ఫోన్ అయినా రాత్రి సమయంలో తీసే ఫొటోలు క్లారిటీ ఉండడం లేదని బాధపడుతుంటారు. ఇలాంటి వారిని టార్కెట్ చేస్తూ వివో ఫోన్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా సూపర్ నైట్ కెమెరాతో ఫొటో లవర్స్ కష్టాలను తీర్చే నూతన ఫోన్ ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Vivo New Phone: సూపర్ నైట్ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఇక ఫొటో లవర్స్‌కు పండగే.. ధర ఎంతో తెలుసా?
Vivo Y56
Nikhil
|

Updated on: Feb 21, 2023 | 12:00 PM

Share

భారత్‌లో ఫోన్ లవర్స్‌ను టార్గెట్ చేస్తూ వివో ఓ కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ముఖ్యంగా యువత ప్రస్తుత కాలంలో ఫొటోలు తీసుకోవడమే ఓ పెద్ద పనిగా ఫీలవుతున్నారు. అందువల్ల మొబైల్ కంపెనీలు కూడా ఎక్కువ మెగా పిక్సెల్స్‌తో ఫోన్స్‌ను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. అయితే ఫొటో లవర్స్ నైట్ టైమ్ ఫొటోస్ తీసుకోడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎంత రేట్ పెట్టి కొన్న ఫోన్ అయినా రాత్రి సమయంలో తీసే ఫొటోలు క్లారిటీ ఉండడం లేదని బాధపడుతుంటారు. ఇలాంటి వారిని టార్కెట్ చేస్తూ వివో ఫోన్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా సూపర్ నైట్ కెమెరాతో ఫొటో లవర్స్ కష్టాలను తీర్చే నూతన ఫోన్ ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ స్టైలిష్ డిజైన్ వై 56 కచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వై సిరీస్‌లోనే ఈ ఫోన్ 5 జీలో రిలీజ్ చేయడం ఆనందంగా వారు పేర్కొంటున్నారు. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టి వివో కచ్చితంగా మిడిల్ క్లాస్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఫోన్ రిలీజ్ చేస్తుందని పేర్కొంటున్నాయి. వివో వై 56 8 జీబీ+ 128 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్ రూ.19,999కు వివోలోని అన్ని స్టోర్స్‌లో కొనుగోలు అందుబాటులో ఉంది. ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ రెండు కలర్స్ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అలాగే వినియోగదారులు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు కార్డుల నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1500 వరకూ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. 

వివో వై 56 స్పెసిఫికేషన్లు ఇవే

  • 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
  • మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్
  • ఫన్ టచ్ ఓఎస్ 13 ద్వారా పని చేసే సామర్థ్యం
  • 50 ఎంపీ నైట్ విజన్ కెమెరా, 2 ఎంపీ బొకే కెమెరాతో వివిధ మోడ్స్‌తో ఫొటోలు తీసుకునే సామర్థ్యం
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం