Instagram: మీ ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కనిపించడం లేదా? అతని ఫోన్ నంబర్‌తో ఈజీగా వెతకొచ్చు.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
మీ స్నేహితుడు లేదా, ఫాలోవర్ ఫోన్ నంబర్ తెలిస్తే చాలా సులభంగా మీకు అవసరమైన ఆ ఖాతాను ఇన్‌స్టాగ్రామ్ లో కనుగొనవచ్చు. అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో మెటా ఆధ్వర్యంలో నడిచే ఇన్‌స్టాగ్రామ్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చాలా ప్రాచుర్యం పొందింది. ఫలితంగా సబ్ స్క్రైబర్స్ పెరిగారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఎవరిదైనా స్నేహితుడు, లేదా ఫాలోవర్ అకౌంట్ ను సెర్చ్ చేయాలంటే వారి పేరును ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్ బార్ లో ఎంటర్ చేస్తే వారి ఖాతా మనకు కనిపిస్తుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ లో బిలియన్ల కొద్దీ యూజర్లు ఉన్న కారణంగా వందలు, వేల సంఖ్యలో మీరు సెర్చ్ చేసిన పేర్లతో కనిపిస్తారు. ఆ జాబితాలో మీ స్నేహితుడిని కనుగొనడం కాస్త కష్టమైన పని. అలాంటి సమయంలో ఏం చేయాలి. మీకు బాగా ఉపయోగపడే టూల్ ఫోన్ నంబర్ సెర్చ్ ఆప్షన్. మీ స్నేహితుడు లేదా, ఫాలోవర్ ఫోన్ నంబర్ తెలిస్తే చాలా సులభంగా మీకు అవసరమైన ఆ ఖాతాను ఇన్‌స్టాగ్రామ్ లో కనుగొనవచ్చు. అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం..
ఇలా చేయాలి..
- మీరు సెర్చ్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఫోన్ నంబర్ ను మీ కాంటాక్ట్స్ లో సేవ్ అయ్యి ఉండేట్లు చూసుకోవాలి.
- మీ ఇన్‌స్టాగ్రామ్‌ని తెరిచి, మీ ఖాతా వివరాలను యాక్సెస్ చేయడానికి దిగువ కుడి ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
- అప్పుడు మీ ప్రోఫైల్ పేజీ ఓపెన్ అవుతుంది. దానికి పైన కుడి వైపు మూలన ఉన్న మెనూని క్లిక్ చేయండి.
- ఆ తర్వత కనెక్ట్ కాంటాక్ట్స్ పక్కన ఉన్న డిస్కవర్ ఇండివిజువల్‌ని క్లిక్ చేసి, ఆ తర్వాత కనెక్ట్ బటన్ పై క్లిక్ చేయండి.
- అప్పుడు మీకు కనిపిస్తున్న జాబితాల నుంచి మీకు కావాల్సిన పేరును మీ కాంటాక్ట్స్ లిస్ట్ ఆధారంగా అది చూపిస్తుంది. మీకు కావాల్సిన యూజర్ నేమ్ ను సలెక్ట్ చేసుకొంటే అతని ప్రోఫైల్ ను చూడవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..