GST: గుడ్ న్యూస్.. పండగవేళ చీపుర్లపై జీఎస్టీ ఎంత తగ్గిందంటే..?
జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా చీపురులపై పన్ను రేటును తగ్గించడంతో ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. చీపురులపై ఇప్పటివరకు 12శాతం జీఎస్టీ ఉండగా.. సెప్టెంబర్ 22 నుంచి అది 5శాతానికి తగ్గనుంది. దీపావళి, దసరా వంటి పండుగల సమయంలో చీపురు ధరలు ఎలా ఉండనున్నాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కేంద్రం తెచ్చిన జీఎస్టీ సవరణలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వినియోగాన్ని పెంచే లక్ష్యంతో, జీఎస్టీ రేట్లలో భారీ తగ్గింపును ప్రకటించారు. దీంతో నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా వాటి ధరలు తగ్గనున్నాయి. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. దీన్ని నెక్ట్స్ జనరేషన్ జీఎస్టీ రీఫార్మ్స్‌గా ఆర్థికమంత్రి అభివర్ణించారు. ముఖ్యంగా గతంలో 12శాతం పన్ను పరిధిలోకి వచ్చిన దాదాపు 99శాతం వస్తువులను ఇప్పుడు 5శాత జీఎస్టీ స్లాబ్‌లోకి మార్చారు. అంటే చాలా నిత్యావసర వస్తువులు ఇప్పుడు చౌకగా లభిస్తాయి.
ధరలు తగ్గుతాయా.. పెరుగుతాయా?
దసరా, దీపావళి వంటి పండుగలు వచ్చినప్పుడు చీపురుల వినియోగం పెరుగుతుంది. ఈ సమయంలో చీపురు ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే సందేహం ప్రజల్లో ఉంది. ఈ కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల చీపురుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
చీపురులపై జీఎస్టీ ఎలా?
చీపురులపై జీఎస్టీ రేట్లు వాటి తయారీకి ఉపయోగించిన పదార్థం, బ్రాండింగ్‌పై ఆధారపడి ఉంటాయి. చీపురుల ప్రధాన HSN కోడ్ 9603. గతంలో ఈ కోడ్ కింద ఉన్న వస్తువులకు 12శాతం జీఎస్టీ ఉండేది. అయితే సెప్టెంబర్ 22 నుండి ఇది కేవలం 5శాతానికి తగ్గింది. దీనివల్ల గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది చీపుర్లు చాలా చౌకగా లభిస్తాయి. గతంలో 12శాతం, 18శాతం పన్ను స్లాబ్‌లలో ఉన్న వివిధ రకాల చీపురులన్నీ ఇప్పుడు 5శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో అన్ని రకాల చీపురులు మునపటి కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఈ పండుగ సీజన్‌లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఈ నిర్ణయం చాలా సహాయపడుతుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




