Gautam Gambhir: వెంటనే డిలీట్ చేయండి..! టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ షాకింగ్ ట్వీట్
క్రెడ్ కొత్త ప్రకటనలో గౌతమ్ గాంభీర్ నటించడం, ఆయన దానిని డిలీట్ చేయమని ట్వీట్ చేయడం వల్ల వివాదం రేగింది. ఇది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీనా లేదా నిజమైన అభిప్రాయమా అనేది చర్చనీయాంశం. యాడ్ AI ని ఎగతాళి చేస్తూ, హాస్యభరితంగా ఉంటుంది.

ఓ వైపు ఆసియా కప్ 2025లో టీమిండియా మంచి ప్రదర్శన చేస్తోంది. పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా షేక్ హ్యాండ్ వివాదం నెలకొన్నప్పటికీ.. టీమిండియా డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ సీరియస్ ట్వీట్ చేశాడు. ‘ఈ ఫైల్‌ను వెంటనే డిలీట్ చేయండి’ అంటూ హెచ్చరించాడు. అయితే ఇది క్రికెట్‌కు సంబంధించిన కాదులేండి. ఓ యాడ్‌కు సంబంధించి క్రెడ్ అనే సంస్థను ఉద్దేశించి గంభీర్ ఈ ట్వీట్ చేశాడు.
CRED కొత్త ప్రచారంలో భాగంగా రోజువారీ జీవితంలో ఏఐని ఎక్కువగా ఉపయోగించడాన్ని ఎగతాళి చేస్తోంది. విచిత్రమైన, ప్రముఖులతో నిండిన ప్రమోషన్లకు ప్రసిద్ధి చెందిన CRED, మళ్ళీ హాస్యం, అతిశయోక్తి, గంభీర్ అర్ధంలేని స్వభావాన్ని ఈ యాడ్ కోసం కంటెంట్‌గా ఉపయోగించింది. ఈ ప్రకటన AI ద్వారా తీసుకువచ్చే విచిత్రమైన పరిస్థితులను, హాస్యభరితమైన ఫలితాలను అందిస్తుంది. అయితే గంభీర్ చేసిన ట్వీట్‌పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే గంభీర్ ఆ యాడ్ నచ్చక దాన్ని డిలీట్ చేయమన్నాడా? లేక ఇది మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగమా అనే చర్చ జరుగుతోంది. దీనిపై క్రెడ్ సంస్థ స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.
DELETE THIS FILE IMMEDIATELY!! @CRED_club pic.twitter.com/FTCVFh4jO6
— Gautam Gambhir (@GautamGambhir) September 19, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




