Smriti Mandhana : అదిరిపోయే ఫామ్‌లో స్మృతి మంధాన.. 52 ఏళ్ల వరల్డ్ కప్ రికార్డు బద్దలు కొడుతుందా?
ఆస్ట్రేలియాపై ఆమె చేసిన 117 పరుగుల ఇన్నింగ్స్ స్మృతి మంధాన కెరీర్‌లో 12వ సెంచరీ. ఈ ఏడాదిలో ఇది ఆమెకి మూడో సెంచరీ కావడం విశేషం. వరల్డ్ కప్‌లో భారత జట్టు కనీసం ఏడు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. స్మృతి మంధాన గనుక రెండు లేదా మూడు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడితే, 1000 పరుగుల మార్కును సులభంగా చేరుకోగలదు.

Smriti Mandhana : మహిళా క్రికెట్ లో భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన, ఇప్పుడు 52 ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆమె అద్భుతంగా ఆడుతోంది. రెండో వన్డేలో కేవలం 77 బంతుల్లో అద్భుతమైన సెంచరీతో స్మృతి మంధాన సత్తా చాటింది. ఇప్పుడు రాబోయే మహిళా ప్రపంచ కప్ లో ఒక అరుదైన రికార్డును సాధించే అవకాశం ఆమెకు ఉంది.
ఒకే ఏడాదిలో 1000 పరుగులు.. అరుదైన రికార్డు
మంధాన ఈ ఏడాది 2025లో 1000 వన్డే పరుగులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఏ మహిళా క్రికెటర్ కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ ఏడాది మంధాన ఇప్పటికే 803 పరుగులు చేసింది, సగటు 61.76గా ఉంది. 1000 పరుగులు పూర్తి చేయడానికి ఆమెకు ఇంకా 197 పరుగులు అవసరం.
వరల్డ్ కప్‌లో రికార్డు సాధ్యమేనా?
ఆస్ట్రేలియాపై ఆమె చేసిన 117 పరుగుల ఇన్నింగ్స్ స్మృతి మంధాన కెరీర్‌లో 12వ సెంచరీ. ఈ ఏడాదిలో ఇది ఆమెకి మూడో సెంచరీ కావడం విశేషం. వరల్డ్ కప్‌లో భారత జట్టు కనీసం ఏడు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. స్మృతి మంధాన గనుక రెండు లేదా మూడు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడితే, 1000 పరుగుల మార్కును సులభంగా చేరుకోగలదు.
చరిత్రలో అత్యంత దగ్గరగా ఉన్నవారు
స్మృతి మంధాన గనుక 1000 పరుగులు సాధిస్తే, ఆమె ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ రికార్డును అధిగమిస్తుంది. క్లార్క్ 1997లో 970 పరుగులు సాధించి, ఇప్పటికీ రికార్డును తన పేరున నిలుపుకుంది. ఈ జాబితాలో ఇతర ఆటగాళ్లలో దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ (882), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (880), అమీ శాట్టర్‌వైట్ (853) ఉన్నారు. ఇప్పుడు స్మృతి మంధాన ఈ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.
స్మృతి మంధాన వన్డే గణాంకాలు
స్మృతి మంధాన ఇప్పటివరకు ఆడిన 86 వన్డే మ్యాచ్‌లలో 44 సగటుతో 3,500కు పైగా పరుగులు సాధించింది. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆమె అత్యధిక స్కోర్ 135. మంధాన తన ఆకర్షణీయమైన స్ట్రోక్స్, ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే కెపాసిటీ వల్ల భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచింది. ఆమె స్థిరమైన ప్రదర్శనలు భారత జట్టుకు స్ట్రాంగ్ ఓపెనింగ్ అందిస్తాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




