Government Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయండి.. రూ.70 లక్షల వరకు సంపాదించండి!

చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణించబడతాయి. ఇందులో మంచి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో మంచి మొత్తం సంపాదించవచ్చు. చిన్న పొదుపు పథకం కింద పబ్లిక్ ప్రావిడెంట్..

Government Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయండి.. రూ.70 లక్షల వరకు సంపాదించండి!
Government Scheme
Follow us

|

Updated on: May 30, 2023 | 5:40 AM

చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణించబడతాయి. ఇందులో మంచి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో మంచి మొత్తం సంపాదించవచ్చు. చిన్న పొదుపు పథకం కింద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, NSC, సుకన్య సమృద్ధి యోజన మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వంటి పథకాలు చేర్చబడ్డాయి. ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చో తెలుసుకుందాం.

ఐదేళ్లపాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ మెచ్యూరిటీపై, మీరు 7.7% వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇందులో పెట్టుబడి పరిమితి లేదు. మీకు కావలసినంత మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు పెట్టుబడిపై ఐదేళ్లలో ఎంత మొత్తం వస్తుందో తెలుసుకోండి.

పన్ను ప్రయోజనాలు:

ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు హామీతో కూడిన రాబడిని పొందుతారు. దీనితో పాటు, అనేక ఇతర సౌకర్యాల ప్రయోజనం కూడా ఉన్నాయి. ఇందులో పన్ను ఆదా అవుతుంది. దీని కింద ఏటా రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80సి కింద ఈ మినహాయింపు ఇవ్వబడింది.

ఇవి కూడా చదవండి

1 లక్ష నుంచి 50 లక్షల పెట్టుబడిపై ఎంత మొత్తం అందుతుంది?

  • మీరు రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, మీకు రూ. 44,903 వడ్డీ, ఐదేళ్లలో మొత్తం రూ. 1.44 లక్షల కార్పస్ లభిస్తుంది.
  • రూ.5 లక్షల పెట్టుబడిపై ఐదేళ్లలో రూ.2.24 లక్షల వడ్డీ అందుతుంది. మొత్తం రూ.7.24 లక్షలు.
  • మీరు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, ఐదేళ్లలో మీకు రూ.4.49 లక్షల వడ్డీ, మొత్తం కార్పస్‌లో రూ.14.49 లక్షలు లభిస్తాయి.
  • రూ. 20 లక్షలు పెట్టుబడి పెడితే, మొత్తం వడ్డీ రూ. 8.98 లక్షలు, మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 28.98 లక్షలు అవుతుంది.
  • ఐదేళ్ల తర్వాత రూ.30 లక్షల పెట్టుబడిపై రూ.13.47 లక్షల వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ.43.47 లక్షలు.
  • ఐదేళ్లపాటు రూ.40 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం కార్పస్ రూ.57.96 లక్షలు. అందులో వడ్డీ రూ.17.96 లక్షలు.
  • రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీలో మొత్తం రూ. 72.45 లక్షలు. మొత్తం వడ్డీ రూ. 22.45 లక్షలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్