AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Alert: మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తించుకోండి.. ఆర్బీఐ హెచ్చరిక

ఏటీఎంల వద్ద డబ్బులు విత్‌డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే తీవ్రంగా మోసపోయే ప్రమాదం ఉంది. చాలా మంది ఏటీఎంల వద్ద విత్‌డ్రా చేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించరు. అలాంటి వారిని సైబర్‌ నేరగాళ్లు మోసగిస్తున్నారు..

ATM Alert: మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తించుకోండి.. ఆర్బీఐ హెచ్చరిక
Atm
Subhash Goud
|

Updated on: May 29, 2023 | 7:00 AM

Share

ఏటీఎంల వద్ద డబ్బులు విత్‌డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే తీవ్రంగా మోసపోయే ప్రమాదం ఉంది. చాలా మంది ఏటీఎంల వద్ద విత్‌డ్రా చేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించరు. అలాంటి వారిని సైబర్‌ నేరగాళ్లు మోసగిస్తున్నారు. చిన్నపాటి పొరపాట్ల కారణంగా భారీ ఎత్తున డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎన్నో హెచ్చరికలు జారీ చేసింది. ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేటపుడు చాలా సార్లు ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. దీని వలన ప్రజలు మోసానికి గురవుతారు.

  1. ఏటీఎం భద్రతా చిట్కాలు: మారుతున్న కాలంతో పాటు, ఏటీఎం వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రజలు బ్యాంకులకు వెళ్లే బదులు ఏటీఎం కార్డు నుండి నగదు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న ఏటీఎంల వినియోగంతో దానికి సంబంధించిన మోసాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి.
  2. ఏటీఎం కార్డులను క్లోనింగ్‌ చేసి.. ఈరోజుల్లో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి మోసగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఏటీఎం మోసాల నుండి కస్టమర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్‌బీఐ కొన్ని భద్రతా చిట్కాలను సూచించింది.
  3. ఏటీఎం పిన్‌ ఎవరితోనూ షేర్‌ చేయవద్దు: మీ ఏటీఎం పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు. దీనితో పాటు, ఎక్కడైనా రాసి కూడా సేవ్‌ చేసుకోవద్దు. మొబైల్‌లో కూడా ఏటీఎం పిన్‌లను సేవ్‌ చేసుకోవద్దు.
  4. కీప్యాడ్‌ కవరింగ్‌: దీనితో పాటు ఏటీఎం మెషీన్‌లో పిన్‌ను నమోదు చేసేటప్పుడు, మీ చేతులతో పిన్‌ కీప్యాడ్‌ను కవర్ చేయండి. డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు తెలియని వ్యక్తుల సహాయం తీసుకోకండి. దీని వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. డబ్బులు తీసుకున్న తర్వాత.. ఇది కాకుండా, నగదు ఉపసంహరణ తర్వాత మీరు తప్పనిసరిగా క్యాన్సిల్‌ బటన్‌ను నొక్కాలి. విత్‌డ్రా ప్రాసెస్‌ అయిన తర్వాత డబ్బులు, ఏటీఎం కార్డును తీసుకోవడం మర్చిపోవద్దు.
  7. మెషీన్‌లో కార్డ్‌ చిక్కుకుంటే.. మీ ఏటీఎం మెషీన్‌లో కార్డ్ చిక్కుకుపోయినట్లయితే, వెంటనే మీ బ్యాంకుకు కాల్ చేసి దాని గురించి తెలియజేయండి. నగదు బయటకు రాకపోయినా, మీరు దాని గురించి బ్యాంకుకు తెలియజేయవచ్చు.
  8. బ్యాంకుకు ఫిర్యాదు చేయండి: ఏటీఎంలో డబ్బులు తీసుకునే సమయంలో ఏదైనా సమస్య ఏర్పడి అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయి ఏటీఎంలో డబ్బులు రాకపోతే బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఇలాంటి సమస్య తలెత్తితో ఒక రోజులో డబ్బులు మీబ్యాంకు అకౌంట్‌కు మళ్లీ బదిలీ అవుతాయి. అయినా ముందస్తుగా బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేస్తే బాగుంటుందని గుర్తించుకోండి.
  9. గుర్తు తెలియని వ్యక్తులతో.. ఏటీఎం వద్ద డబ్బులు విత్‌డ్రా చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇతర వ్యక్తులతో డ్రా చేయించకూడదు. మీకు తెలియపోతే మీ ఇంట్లో వ్యక్తులను వెంట తీసుకెళ్లాలి తప్ప గుర్తు తెలియని వ్యక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..