Tokenaization: టోకనైజేషన్ అంటే ఏమిటి? ఈ విధానం ఎలా పనిచేస్తుంది?

ఇప్పుడు వీసా కార్డ్‌ని ఉపయోగించడం వల్ల మీ సమయంతో పాటు శ్రమ కూడా ఆదా అవుతుంది. వాస్తవానికి, కార్డ్ చెల్లింపు సంస్థ వీసా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయడంతో సహా వివిధ సేవలకు CVV-రహిత చెల్లింపుల సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. టోకనైజ్డ్..

Tokenaization: టోకనైజేషన్ అంటే ఏమిటి? ఈ విధానం ఎలా పనిచేస్తుంది?
Tokenaization
Follow us
Subhash Goud

|

Updated on: May 30, 2023 | 1:29 PM

ఇప్పుడు వీసా కార్డ్‌ని ఉపయోగించడం వల్ల మీ సమయంతో పాటు శ్రమ కూడా ఆదా అవుతుంది. వాస్తవానికి, కార్డ్ చెల్లింపు సంస్థ వీసా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయడంతో సహా వివిధ సేవలకు CVV-రహిత చెల్లింపుల సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. టోకనైజ్డ్ కార్డ్‌లతో చెల్లింపులు చేసేటప్పుడు మీరు ఇకపై కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (సీవీవీ)ని నమోదు చేయనవసరం లేదని దీని అర్థం. సీవీవీ అనేది క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వెనుక ప్రింట్ అయి ఉండే మూడు అంకెల సంఖ్య.

టోకనైజేషన్ అంటే ఏమిటి?

బిజినెస్ వెబ్‌సైట్‌లో కస్టమర్‌లు 16-అంకెల డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్.. గడువు తేదీ వంటి వివరాలను నమోదు చేయవలసిన అవసరాన్ని టోకనైజేషన్ విధానం తొలగిస్తుంది. దీని మరొక ప్రయోజనం ఏమిటంటే ఇది సైబర్ మోసం ప్రమాదం నుంచి వినియోగదారులను రక్షించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఆన్‌లైన్ వ్యాపారులు కస్టమర్ కార్డ్ వివరాలను నిల్వ చేయరు. దీనికి సంబంధించిన టోకెన్‌ను మాత్రమే సేవ్ చేస్తారు. అంతేకాకుండా, ఒకే టోకెన్ వేర్వేరు వెబ్ సైట్ లలో ఉపయోగించలేరు. ప్రతి ఇ-కామర్స్ సైట్ కోసం ప్రత్యేక టోకెన్‌ను రూపొందించడం అవసరం. మీరు వీసా కార్డ్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు Zomato వంటి ఈ-కామర్స్ యాప్‌లు .. Razorpay వంటి చెల్లింపు సేవల యాప్‌లలో ఈ సేవలను పొందవచ్చు.

CVV టోకనైజేషన్ ఎలా పని చేస్తుంది?

వ్యాపారులు టోకనైజేషన్‌ను స్వీకరించినప్పుడు, కస్టమర్ భారతదేశంలో లావాదేవీలు జరిపిన ప్రతిసారీ సీవీవీని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కస్టమర్‌లు తమ కార్డ్‌ని వ్యాపారి లేదా ఇ-కామర్స్ సైట్‌లో టోకనైజ్ చేసినప్పుడు, వారు 3-అంకెల సీవీవీ కోడ్‌ను ఒక్కసారి మాత్రమే అందించాలి. ఆ తరువాత, తదుపరి లావాదేవీలలో దాని అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి

ప్రయోజనాల పరంగా, సీవీవీ రహిత ఫీచర్ ఆన్‌లైన్ లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా.. సులభంగా చేస్తుంది. టోకనైజేషన్‌తో, కార్డ్ వివరాలు ప్రత్యేక కోడ్‌తో ఫిల్ అవుతాయి. అసలు కార్డ్ వివరాలకు బదులుగా కోడ్ మాత్రమే షో అవుతుంది. ఇది లావాదేవీల భద్రతను పెంచుతుంది. అదనంగా, టోకనైజ్డ్ లావాదేవీలు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటాయి. అంటే మీరు లావాదేవీని రెండుసార్లు ధృవీకరించాలి.

ప్రస్తుతం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు ఆదరణ లభించడం వల్ల కార్డ్‌ల వినియోగం, ముఖ్యంగా డెబిట్ కార్డ్‌ల వినియోగం తగ్గుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లెక్కల ప్రకారం, 2022 క్యాలెండర్ సంవత్సరంలో, యూపీఐ ద్వారా సుమారు 74 బిలియన్ లావాదేవీలు జరిగాయి. మొత్తం లావాదేవీ విలువ సుమారు 1.26 లక్షల కోట్ల రూపాయలు. అయితే, వీసా సేవను ప్రవేశపెట్టడంతో, కార్డుల వినియోగంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వీసా భారతదేశంలో .. ప్రపంచంలో అతిపెద్ద కార్డ్ కంపెనీ .. ఈ ఫీచర్ వలన కార్డ్ వినియోగం పెరుగుదల అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి