Microsoft: కేంద్రం పండుగలాంటి వార్త.. 2026 కల్లా ఏఐతో ఉద్యోగావకాశాలు

Microsoft: భారతదేశంలోని ప్రతి వ్యక్తి, సంస్థకు సాధికారత కల్పించాలనేది మైక్రోసాఫ్ట్ లక్ష్యమని చెప్పిన సీఈవో సత్య నాదెళ్ల .. భవిష్యత్‌లో ఏఐ నిపుణుల అవసరం పెద్ద సంఖ్యలో ఏర్పడుతుందన్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో భారతీయ నిపుణులు ముందుంటారని, 2026 కల్లా ఏఐతో ఆదేశంలో అనేక ఉద్యోగావకాశాలు రానున్నాయి..

Microsoft: కేంద్రం పండుగలాంటి వార్త.. 2026 కల్లా ఏఐతో ఉద్యోగావకాశాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 08, 2025 | 5:09 PM

మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సిఇఒ సత్య నాదెళ్ల బుధవారం దేశంలో అనేక AI భాగస్వామ్యాలను ప్రకటించారు. ఇందులో 5 లక్షల మందికి నైపుణ్యం కల్పించడానికి ప్రభుత్వానికి చెందిన ‘ఇండియా AI మిషన్’తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌కు చెందిన ఒక విభాగం అయిన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో అవగాహన ఒప్పందం, AIని కొత్త ఆవిష్కరణలకు, దేశవ్యాప్తంగా వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంఓయూలో భాగంగా మైక్రోసాఫ్ట్, ఇండియా AI కలిసి 2026 నాటికి విద్యార్థులు, అధ్యాపకులు, డెవలపర్‌లు, ప్రభుత్వ అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సహా 500,000 మందికి వ్యక్తులకు నైపుణ్యాన్నిఅందించనున్నారు. అలాగే 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. ఎన్నడూ లేని విధంగా 3 బిలియన్‌ డాలర్లును పెట్టుబడిగా పెడుతున్నందుకు సంతోషిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ పెట్టుబడి భారత్​లో ఏఐ ఆవిష్కరణలకు ఊతం ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ విస్తరణకు పెద్దపీట వేస్తోందన్నారు.

దేశంలో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని, దేశంలోని నలుమూలలా AI, క్లౌడ్ విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, 20 వేలమందిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు గతంలోనే ప్రకటించామన్నారు. అవగాహన ఒప్పందంలో భాగంగా వారు 20,000 మంది అధ్యాపకులకు ఫౌండేషన్‌ కోర్సులను అందించడానికి 10 రాష్ట్రాల్లోని 20 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు (NSTIలు)/NIELIT కేంద్రాలలో ‘AI ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.

చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఏఐ స్కిల్స్​పై శిక్షణ ఇస్తామని, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో భారతీయ నిపుణులు ముందు వరుసలో ఉంటారన్నారు. ఏఐ ఆవిష్కరణలలో భారత్ పురోగమిస్తోందని సత్య నాదెళ్ల అబిప్రాయపడ్డారు. ఇండియా AI మిషన్ ప్రయోజనాలను దేశంలోని ప్రతి మూలకు విస్తరించడానికి, సాంకేతికత, వనరులకు యాక్సెస్‌ చేయడానికి ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి మేము సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చందోక్ అన్నారు.

భారతదేశంలోని ప్రతి వ్యక్తి, సంస్థకు సాధికారత కల్పించాలనేది మైక్రోసాఫ్ట్ లక్ష్యమని చెప్పిన సత్య నాదెళ్ల .. భవిష్యత్‌లో ఏఐ నిపుణుల అవసరం పెద్ద సంఖ్యలో ఏర్పడుతుందన్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో భారతీయ నిపుణులు ముందుంటారని, అందుకే, 2025 నాటికి 2 మిలియన్ల మందిని ఏఐ నిపుణులగా తీర్చిదిద్దే ఉద్దేశంతో గతంలో ‘అడ్వాంటేజ్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

అనుకున్నదానికంటే ముందే ఆ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. అదే కార్యక్రమం కింద 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌ అందించాలని లక్ష్యమని సత్యనాదెళ్ల వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే 2.4 మిలియన్ల భారతీయులకు, సివిల్‌ సర్వేంట్లు, కళాశాల విద్యార్థులు, వికలాంగులు AI నైపుణ్యాలతో సాధికారత కల్పించింది.

ఇటీవల మైక్రోసాఫ్ట్ చేత నియమించిన ఐడీసీ అధ్యయనం భారతదేశంలో AI వినియోగం 2023లో 63 శాతం నుండి 2024 నాటికి 72 శాతానికి పెరిగింది. మంగళవారం, మైక్రోసాఫ్ట్ కొత్త డేటా సెంటర్ల స్థాపనతో సహా వచ్చే రెండేళ్లలో భారతదేశంలో క్లౌడ్, AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 3 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ఆయన ప్రకటించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి