Maruti Suzuki: మారుతీ సుజుకికి చెందిన ఏ కారు అత్యధిక మైలేజీ ఇస్తుంది? ధర ఎంత?

Maruti Suzuki: సామాన్యులకు అందుబాటు ధరల్లో, మంచి మైలేజీ ఇచ్చే కార్ల కంపెనీలలో మారుతి సుజుకీ ఒకటి. ఈ కంపెనీలు మంచి మైలేజీ ఇచ్చే కార్లు ఉన్నాయి. అందుకే చాలా మంది ఈ కార్లను ఇష్టపడుతుంటారు. జపాన్‌కు చెందిన ఆటోమేకర్‌ మారుతి సుజుకి కార్లు భారత ఆటో పరిశ్రమను శాసిస్తున్నాయి..

Maruti Suzuki: మారుతీ సుజుకికి చెందిన ఏ కారు అత్యధిక మైలేజీ ఇస్తుంది? ధర ఎంత?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 08, 2025 | 5:23 PM

జపాన్‌కు చెందిన ఆటోమేకర్‌ మారుతి సుజుకి కార్లు భారత ఆటో పరిశ్రమను శాసిస్తున్నాయి. మారుతీ కార్లు మంచి మైలేజీని ఇస్తాయి. దీనితో పాటు, ఈ బ్రాండ్‌కు చెందిన చాలా కార్లు సామాన్యుల బడ్జెట్‌లో వస్తాయి. మెరుగైన మైలేజీ, తక్కువ ధర కారణంగా ఈ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మారుతి అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు ఏది? దాని ధర ఎంత అనేది తెలుసుకుందాం.

అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు:

జపనీస్ వాహన తయారీదారుల అత్యధిక మైలేజ్ కారు మారుతి గ్రాండ్ విటారా. ఇది మారుతి సుజుకికి చెందిన హైబ్రిడ్ కారు. ఈ వాహనంలో 1462 cc పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. వాహనంలో అమర్చిన ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 75.8 kW శక్తిని అందిస్తుంది. అలాగే 4,400 rpm వద్ద 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాండ్ విటారాలో ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ ఉంది. దీని హైబ్రిడ్ మోడల్‌లో లిథియం అయాన్ బ్యాటరీ అమర్చింది కంపెనీ. ఇది 3,995 rpm వద్ద 59 kW శక్తిని, 0 నుండి 3,995 rpm వరకు 141 Nm టార్క్‌ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మారుతి ఈ కారు పెట్రోల్ వేరియంట్‌లో 27.97 kmpl మైలేజీని ఇస్తుందని పేర్కొంది. దీని మాన్యువల్ సీఎన్‌జీ వేరియంట్ మైలేజ్ 26.6 km/kg. మారుతి గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుండి మొదలై రూ. 20.09 లక్షల వరకు ఉంటుంది.

మారుతీ స్విఫ్ట్:

మారుతి స్విఫ్ట్ వాహన తయారీదారుల అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటి. ఈ వాహనం Z12E పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,700 rpm వద్ద 60 kW శక్తిని, 4,300 rpm వద్ద 111.7 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు 24.8 kmpl మైలేజీని ఇస్తుందని పేర్కొంది. మారుతి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

మారుతి డిజైర్:

కొత్త మారుతి డిజైర్‌లో 1.2-లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ని అమర్చారు. ఈ ఇంజన్‌తో ఈ కారు 25.71 kmpl మైలేజీని ఇస్తుందని పేర్కొంది. మారుతి స్విఫ్ట్ CNG 33.73 km/kg మైలేజీని ఇస్తుంది. కొత్త డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుండి రూ.10.14 లక్షల మధ్య ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి