AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Brezza 2022: 12 సరికొత్త ఫీచర్లతో రానున్న మారుతీ బ్రెజా 2022.. పూర్తి జాబితా ఇదిగో..

బ్రెజా 2022లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ESP వంటి కొత్త భద్రతా ఫీచర్‌లతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత బ్రెజా నుంచి ఇతర భద్రతా ఫీచర్లు క్యారీ అయ్యే అవకాశం ఉంది.

Maruti Brezza 2022: 12 సరికొత్త ఫీచర్లతో రానున్న మారుతీ బ్రెజా 2022.. పూర్తి జాబితా ఇదిగో..
Maruti Brezza 2022
Venkata Chari
|

Updated on: May 09, 2022 | 1:06 PM

Share

మారుతి సుజుకి 2022 బ్రెజాను వచ్చే నెలలో విడుదల చేసేందుక సిద్ధమైంది. ప్రస్తుతం వెలుపల డిజైన్, ఇంటీరియర్ లేఅవుట్స్ ఫైనల్ టచ్‌లో ఉన్నాయి. 2022 బ్రెజా నుంచి విటారాను కూడా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌లిఫ్టెడ్ కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు అప్‌డేట్ చేసిన ఇంజన్ కూడా బ్రెజాలో చూడొచ్చని వార్తలు వస్తున్నాయి. 2022 బ్రెజ్జా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ESP వంటి కొత్త భద్రతా ఫీచర్‌లతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత బ్రెజా నుంచి ఇతర భద్రతా ఫీచర్లు క్యారీ అయ్యే అవకాశం ఉంది. 2022 Brezza, 2022 Baleno నుంచి Android Auto, Apple CarPlayతో కొత్త 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 2022 Brezzaలో దిగువ వేరియంట్‌లు అయిన కొత్త Baleno, కొత్త XL6 చూసిన పాత 7.0-అంగుళాల స్క్రీన్‌ను పొందే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Mileage Bikes: ఇండియాలో తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఐదు బైక్‌లు ఇవే..!

2022 బ్రెజా హెడ్స్-అప్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, కనెక్ట్ చేసే కార్ టెక్నాలజీ వంటి అనేక కొత్త ఫంక్షనల్ ఫీచర్‌లను పొందే ఛాన్స్ ఉంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో గేర్‌లను మాన్యువల్‌గా మార్చడానికి ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా అందివ్వనున్నారు. 2022 బ్రెజాలో డ్రైవర్ కోసం ఆటో అప్/డౌన్ పవర్ విండోస్, క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్ స్టీరింగ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, సీట్ బెల్ట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ORVMలు, కూల్డ్, ఇల్యూమినేటెడ్ గ్లోవ్‌బాక్స్, ఇల్యూమినేటెడ్ ఫుట్‌వెల్, బూట్, ఆటో వంటి ఫీచర్లు ఉంటాయి. AC, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఫ్రంట్, రియర్ ఆర్మ్‌రెస్ట్‌లతో కీలెస్ ఎంట్రీ, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు అందించనున్నారు. 2022 బ్రెజా 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్‌ను పొందుతుంది. 2022 బ్రెజా స్టైల్-సంబంధిత ఫీచర్లు కొత్త షార్క్-ఫిన్ యాంటెన్నాగా ఉంటాయి.

ఈ 12 ఫీచర్లతో విడుదలయ్యే ఛాన్స్..

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

ప్యాడిల్ షిఫ్టర్‌లు (ఆటోమేటిక్ వేరియంట్ మాత్రమే)

360 డిగ్రీ పార్కింగ్ కెమెరా

ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు

6 ఎయిర్‌బ్యాగ్‌లు

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్

టెలిమాటిక్స్

కొత్త 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

హెడ్ అప్ డిస్ప్లే

షార్క్ ఫిన్ ఆంటెన్నా

60:40 స్ప్లిట్ రియర్ సీట్లు

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి..

Also Read: Vivo Budget Phone: వివో నుంచి Y సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌, ఇతర వివరాలు!

Apple Credit Card Payments: క్రెడిట్‌ కార్డుల నుంచి చెల్లింపులను నిలిపివేసిన ఆపిల్‌.. ఎందుకంటే..!