UPI Scams: యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు మస్ట్..!
దేశంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ ఈ నగదు రహిత విధానానికి అలవాటు పడ్డారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ద్వారా డబ్బులను చాలా సులభంగా చెల్లించవచ్చు. రోడ్డు పక్కనే ఉండే చిన్న దుకాణాల నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ యూపీఐ చెల్లింపులను అనుమతి ఉంది.
యూపీఐ ద్వారా చిల్లర ఇబ్బందులు లేకుండా సురక్షితంగా డబ్బులను పంపుకోవచ్చు. అయితే ఇదే సమయంలో యూపీఐ లావాదేవీలలో మోసాలు కూడా పెరిగిపోయాయి. వాటి నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. దేశంలో 2016లో యూపీఐ లావాదేవీలు మొదలయ్యాయి. ప్రారంభంలో నామమాత్రంగానే ఉన్నా, ఆ తర్వాత కాలంలో విపరీతంగా పెరిగాయి. కాల క్రమీణా పెరుగుతూ 2024-25 నాటికి 34.5 శాతానికి పెరిగి, 90.7 లక్షల నుంచి 1.22 లక్షల కోట్లకు చేరుకున్నాయి. యూపీఐ ద్వారా లావాదేవీలు చాలా సులభంగా చేసే వీలు ఉండడంతో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో 2024 మొదటి అర్ధభాగంలో రూ.485 కోట్ల విలువైన 6.32 లక్షల యూపీఐ చెల్లింపు మోసాల కేసులు నమోదయ్యాయి. దాని ముందు ఏడాది 13.42 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి.
పెరుగుతున్న మోసాలను అదుపు చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పలు రకాల భద్రతా చర్యలు చేపడుతోంది. అయినా వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించాలంటే ప్రజలకు అవగాహన పెంచుకోవాలి. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోవాలి. ముఖ్యంగా యూపీఐ విధానంలో డబ్బులను స్వీకరించడానికి మీరు ఎలాంటి క్యూాఆర్ కోడ్ ను స్కాన్ చేయనవసరం లేదు. యూపీఐ పిన్ కూడా నమోదు చేయకూడదు. డబ్బులు పంపించే వ్యక్తికి మీ ఫోన్ నంబర్ పంపిస్తే సరిపోతుంది.
- జాగ్రత్తలు ఇవే
- యూపీఐ లావాదేవీలు చేసేటప్పడు సురక్షితమైన నెట్ వర్క్ ను ఉపయోగించండి. పేమెంట్లు చేయడం, బ్యాంక్ యాప్ లను యాక్సెస్ చేసేటప్పుడు పబ్లిక్ వైఫే వాడకపోవడమే మచింది. తద్వారా మన డేటా చోరీ కాకుండా జాగ్రత్త పడవచ్చు.
- విశ్వసనీయ యాప్ లను మాత్రమే డౌన్ లోడ్ చేయాలి. ప్రైవేటు యాప్ ప్రామాణికతను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి.
- మీ ఫోన్ కు వచ్చిన, ఆన్ లైన్ లో కనిపించిన అనుమానాస్పద లింక్ లను క్లిక్ చేయకపోవడమే మంచిది.
- బ్యాంకు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ లోని ఫోన్ నంబర్ ను మాత్రమే సంప్రదించండి.
- ఆర్థిక లావాదేవీ చేసేముందు గ్రహీత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి.
- మీ ఫోన్ కు వచ్చే యూపీఐ లింకులపై జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మోసపూరిత లింకులు అచ్చం నిజమైనవిగానే ఉంటాయి. వాటి ద్వారా చెల్లింపులు జరిపితే నష్టపోతాం.
- ఒకవేళ ఇలా మోసపోతే వెంటనే బ్యాంకును సంప్రదించండి. మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోండి.
- నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (సైబర్ క్రైమ్.జీవోవీ.ఇన్)కు ఫిర్యాదు చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..