UPI: యూపీఐ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ లిమిట్‌ పెంచుతూ నిర్ణయం..

యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. యూపీఐ లైట్‌ లిమిట్‌ను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ యూపీఐ లైట్‌ ద్వారా ఇప్పటి వరకు ఎంత ట్రాన్సాక్షన్‌ చేసే అవకాశం ఉండేది.? ఇప్పుడు ఎంతకు పెరిగింది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

UPI: యూపీఐ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ లిమిట్‌ పెంచుతూ నిర్ణయం..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 05, 2024 | 4:13 PM

యూపీఐ పేమెంట్స్‌కి భారీగా ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎమ్‌ ఇలా డిజిటల్‌ వ్యాలెట్స్‌ వినియోగం ఎక్కువైంది. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండడం, ఇంటర్నెట్‌ సేవలు కూడా అందరికీ అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. కాగా యూజర్ల అవసరాలకు అనుగుణంగా యూపీఐ పేమెంట్స్‌ అనే రకాల మార్పులు చేర్పులు చేస్తున్నారు.

ముఖ్యంగా చిన్న చిన్న పేమెంట్స్‌ను క్షణాల్లో చేసేందుకు వీలుగా యూపీఐ లైట్ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. యూపీఐ లైట్‌ ద్వారా యూజర్లు పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేకుండానే పేమెంట్స్ సుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితిని పెంచుతూ తాజాగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ఒక్క యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్‌ విలువ రూ. 500గా ఉడగా ప్రస్తుతం రూ. 1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వ్యాలెట్‌ లిమిట్‌ రూ. 2000గా ఉండగా దానిని రూ. 5000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూపీఐ లైట్‌లో కేవలం పిన్‌మాత్రమే కాకుండా ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌ మోడ్‌లో తక్కువ మొత్తంతో కూడిన ట్రాన్సాక్షన్స్‌ను సులభతం చేసే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022లో జారీ చేసిన ‘ఆఫ్‌లైన్‌ ఫ్రేమ్‌ వర్క్‌’ని బుధవారం సవరించింది. ఇందులో భాగంగానే లిమిట్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో యూపీఐ పేమెంట్స్‌కి మరింత ఆదరణ లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..