CIBIL Score: సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలేంటి?
సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలేంటి? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇది.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈ సిబిల్ స్కోర్‌ను నిర్వహిస్తున్న..
ఇది.. సాక్షాత్తు ఓ ఎంపీ యావత్ భారత ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తున్న సిబల్ స్కోర్ గురించి లేవనెత్తిన సందేహాలు. ఆయన మాటలు విన్న తర్వాత సగటు భారతీయుల జీవితాలకు ఈ సిబిల్ స్కోర్ ఎంతటి గుదిబండగా తయారైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ తర్వాత కోట్లాది మంది జీవితాలు తలకిందులైపోయాయి. అదే సమయంలో తీసుకున్న రుణాలకు గడువు తేదీలోగా ఈఎంఐలు కట్టకపోవడం… ఆర్థిక ఇబ్బందుల కారణంగా లావాదేవీల విషయంలో జరిగిన పొరపాట్లు వారివారి సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. నిజానికి కార్తీ చిదంబరం చెప్పినట్టు ఈ సిబిల్ అనే బ్రహ్మ పదార్థం ఎలా అప్ డేట్ అవుతుంది.. ఎన్నాళ్లకు అప్ డేట్ అవుతుంది.. అసలు అప్ డేట్ అవుతుందా..లేదా ఈ విషయంలో సామాన్యులకు క్లారిటీ ఉండానుకోవడం కాస్త కష్టమైన విషయమే. అంతే కాదు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈ సిబిల్ స్కోర్‌ను నిర్వహిస్తున్న ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థపై విశ్వసనీయతకు సంబంధించిన సందేహాలు కూడా లేవనెత్తారు. దీంతో ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ వ్యవహారంపై మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

