Rupay Credit Card: లావాదేవీల్లో రూపే కార్డు నయా రికార్డు.. ఏడు నెలల్లోనే రెట్టింపు లావాదేవీలు

భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ చెల్లింపు పద్ధతులు చాలా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. ఈ నేపథ్యంలో ఉద్యోగులు చిన్న చిన్న అప్పులకు వేరే వారిపై ఆధారపడకుండా క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేసి జీతం వచ్చాక కట్టడం ఈ మధ్య సర్వ సాధారణంగా మారింది. ఈనేపథ్యంలో క్రెడిట్ కార్డులను మరింత చేరువ చేయడానికి రూపే క్రెడిట్ ద్వారా యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Rupay Credit Card: లావాదేవీల్లో రూపే కార్డు నయా రికార్డు.. ఏడు నెలల్లోనే రెట్టింపు లావాదేవీలు
Rupay Credit Card
Follow us
Srinu

|

Updated on: Dec 05, 2024 | 3:04 PM

రూపే క్రెడిట్ కార్డ్‌లపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా ప్రాసెస్ చేసిన లావాదేవీలు 2025 ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంతో  పోలిస్తే రెట్టింపు అయ్యాయి. రూపే అనేది భారతదేశానికి సంబంధించిన సొంత చెల్లింపు నెట్‌వర్క్ వ్యవస్థ. ఇది ప్రభుత్వ మద్దతుతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ద్వారా 2012లో ప్రారంభించారు. రూపే క్రెడిట్ కార్డ్ జూన్ 2017లో ప్రారంభించారు. అప్పటి నుంచి 2024 అక్టోబర్ వరకు రూ.63,825.8 కోట్ల విలువైన 750 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 

2024 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు రూ. 33,439.24 కోట్ల విలువైన 362.8 మిలియన్లుగా నమోదయ్యాయి. కాబట్టి 2025 మొదటి ఏడు నెలల్లో దాదాపు రెండింతలు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో రెండో భాగంలో మొత్తం రూ. 134.67 కోట్లతో 0.86 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది.దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత సెప్టెంబరు 2022లో యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి అపెక్స్ పేమెంట్స్ బాడీ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. వినియోగదారులు బిజినెస్ చెల్లింపులు చేయడానికి యూపీఐ యాప్‌లలో తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయవచ్చు.

టైర్-II నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రెడిట్ కార్డుల చెల్లింపులను చేరువ చేసేందుకు యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూపీఐ చెల్లింపులు చేసే వినియోగదారులకు అదనపు క్రెడిట్ సదుపాయాన్ని అందించే యూపీఐ అనుసంధానించబడిన రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టామని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ్యలో పేర్కొన్నారు. యూపీఐ లింక్ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌లపై వ్యాపారి తగ్గింపు రేట, ఇంటర్‌చేంజ్ ఫీజు చిన్న వ్యాపారులకు రూ. 2,000 వరకు ఎలాంటి చార్జీలు లేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రెడిట్ కార్డు యూపీఐ చెల్లింపులు పెరిగాయని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..