AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే సబ్సిడీ బంద్.. వెంటనే ఇలా చేయండి..

దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులందరికీ కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు సాధారణ సిలిండర్ వాడుతున్నా లేదా ఉజ్వల యోజన కింద సబ్సిడీ పొందుతున్నా... జూన్ 30 లోగా ఒక చిన్న పని పూర్తి చేయకపోతే మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా ఆగిపోతుంది. గ్యాస్ కనెక్షన్ల అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ ఏంటి? అనేది తెలుసుకుందాం..

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే సబ్సిడీ బంద్.. వెంటనే ఇలా చేయండి..
Lpg Gas E Kyc DeadlineImage Credit source: AI Image
Krishna S
|

Updated on: May 23, 2026 | 6:29 PM

Share

దేశవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, గ్యాస్ పంపిణీ సంస్థలు కీలక అలర్ట్ జారీ చేశాయి. సాధారణ ఎల్పీజీ సిలిండర్ వాడుతున్న వారైనా లేదా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ పొందుతున్న వారైనా… వెంటనే అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒక చిన్న పని పూర్తి చేయకపోతే, మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు మీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ సేవలకు కూడా అంతరాయం కలగవచ్చు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని కొనసాగించడానికి ఇ-కేవైసీని తప్పనిసరి చేసినట్లు ఎల్పీజీ పంపిణీదారులు స్పష్టం చేశారు. నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి, అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీ ఇ-కేవైసీ ని అప్‌డేట్ చేయడానికి జూన్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి వినియోగదారులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా, అంతకంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ఉత్తమం.

గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగక్కర్లేదు.. మొబైల్‌లోనే ఇ-కేవైసీ

ఈ మండుటెండల్లో ఇ-కేవైసీ కోసం గ్యాస్ ఆఫీసుల చుట్టూ, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ద్వారా ఇంటి నుంచే కేవలం 5 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

విధానం 1: గ్యాస్ కంపెనీ అధికారిక యాప్ ద్వారా

  • మీ గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • మీ గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
  • యాప్‌లోని My Profile ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • అక్కడ మీకు LPG వివరాల క్రింద e-KYC ఆప్షన్ కనిపిస్తుంది.
  • నిబంధనలు, షరతులను చదివి.. అంగీకరిస్తున్నాను పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే OTP ద్వారా లేదా ఫేస్ స్కాన్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించి, సబ్మిట్ చేయండి.
  • మీ e-KYC 24 నుండి 48 గంటలలోపు అప్‌డేట్ అవుతుంది.

విధానం 2: ఉమాంగ్ యాప్ ద్వారా

ఒకవేళ మీ గ్యాస్ కంపెనీకి ప్రత్యేక యాప్ లేకపోయినా, లేదా అందులో సాంకేతిక సమస్యలు వచ్చినా ప్రభుత్వ అధికారిక ఉమాంగ్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు:

  • ఉమాంగ్ యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
  • సెర్చ్ బార్‌లో Gas Service ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • అక్కడ కనిపించే e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ వివరాలు ఎంటర్ చేసి, OTP లేదా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయండి.

ఆన్‌లైన్‌లో ఇ-కేవైసీ చేసేటప్పుడు ఫేస్ అథెంటికేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి ప్రభుత్వ అధికారిక AadhaarFaceRd యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ లేకపోతే మాత్రం, మీరు నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ సొమ్మును కోల్పోకుండా ఉండాలంటే వెంటనే మీ మొబైల్‌లో ఈ రోజే ఇ-కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి.

Follow Us
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్
ఈ కూరగాయ సాగు రైతును ధనవంతున్ని చేసింది.. రైతుకు సీఎం సత్కారం..!
ఈ కూరగాయ సాగు రైతును ధనవంతున్ని చేసింది.. రైతుకు సీఎం సత్కారం..!
ఈ నెలలోనే పవిత్ర గంగా దసరా.. సక్సెస్, సుఖ,సంతోషాల కోసం చేయాల్సిన
ఈ నెలలోనే పవిత్ర గంగా దసరా.. సక్సెస్, సుఖ,సంతోషాల కోసం చేయాల్సిన
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..
933 బంతుల్లో 100 సిక్సర్లతో కోహ్లీ ఫ్రెండ్ దూకుడు..
933 బంతుల్లో 100 సిక్సర్లతో కోహ్లీ ఫ్రెండ్ దూకుడు..
బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని..
బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని..