AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఈ కూరగాయ సాగు రైతును ధనవంతున్ని చేసింది.. సీఎం చేతుల మీదుగా సత్కారం..!

Success Story: ఈ పంట సాగులో మంచి లాభాలు ఆర్జించడమే కాకుండా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు. ఆయన చేస్తున్న శాస్త్రీయ కూరగాయల సాగుకు గాను, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేతుల మీదుగా..

Success Story: ఈ కూరగాయ సాగు రైతును ధనవంతున్ని చేసింది.. సీఎం చేతుల మీదుగా సత్కారం..!
Cultivating Bitter Gourd
Subhash Goud
|

Updated on: May 23, 2026 | 6:03 PM

Share

Success Story: ధైర్యం, పట్టుదల ఉంటే ఏ పనినైనా సునాయాసంగా సాధించవచ్చని అంటారు. సుల్తాన్‌పూర్‌కు చెందిన రైతు రవి కుమార్ దీనికి నిదర్శనం. అతను ఈ వేసవి కాలంలో కాకరకాయ సాగు చేసి గణనీయమైన లాభం సంపాదించాడు. అతను ఎన్నో ఏళ్లుగా కూరగాయల సాగు చేస్తున్న రైతు. కూరగాయల సాగు పట్ల ఆయన అనుసరించిన శాస్త్రీయ, ఆధునిక విధానం ఆయన్ని సమాజంలో ఒక విజయవంతమైన రైతుగా నిలబెట్టింది. అందుకే ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆయనను సత్కరించారు. రవి కుమార్ సక్సెస్‌ స్టోరీ గురించి తెలుసుకుందాం..

సుల్తాన్‌పూర్‌లోని దుబేపూర్ బ్లాక్‌లోని దిహ్వా గ్రామానికి చెందిన రైతు రవి కుమార్ వర్మ, తాను 10 సంవత్సరాలకు పైగా కూరగాయల సాగు చేస్తున్నానని చెబుతున్నాడు. ఆయన తన కూరగాయల సాగులో శాస్త్రీయ పరికరాలను ఉపయోగిస్తారు. అంతేకాకుండా, కృషి విజ్ఞాన్ కేంద్రం, వ్యవసాయ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో ఆయన శాస్త్రీయ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తారు.

ఇది కూడా చదవండి: Vande Bharat: వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?

ఇవి కూడా చదవండి

ఈ కారణంగానే ఆయన మంచి లాభాలు ఆర్జించడమే కాకుండా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు. ఆయన చేస్తున్న శాస్త్రీయ కూరగాయల సాగుకు గాను, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేతుల మీదుగా ఆయనకు సత్కారం జరిగింది.

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.1 లక్షను రూ.21 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్‌..!

12వ తరగతి పరీక్ష పాస్ అయినప్పటికీ రవి వర్మ చదువు మానేసి కూరగాయల సాగు మొదలుపెట్టి, అందులో విజయం కూడా సాధించారు. తాను గత 10 ఏళ్లుగా కూరగాయల సాగు చేస్తున్నానని ఆయన తెలిపారు. కూరగాయల సాగులో ఆయన కాకరకాయ, వంకాయ, బెండకాయ మొదలైన పంటలను పండిస్తారు. ప్రస్తుతం ఆయన వేసవి కాలంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో స్కాఫోల్డింగ్ పద్ధతిలో కాకరకాయ సాగు చేస్తున్నాడు.

ఈ సాగు ద్వారా ప్రతి ఏటా లక్షలాది రూపాయలు ఆదాయం పొందుతున్నట్లు చెబుతున్నాడు. వ్యవసాయంలో శాస్త్రీయ, ఆధునిక పద్ధతులను అనుసరిస్తే, కాకరకాయ సాగు నుండి ఖచ్చితంగా మంచి లాభం పొందవచ్చని ఆయన అంటున్నాడు.

ఇది కూడా చదవండి: Petrol Price: కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది? ఎలాగో తెలుసా?

ఇది కూడా చదవండి: పోస్టాఫీసులో నెలకు రూ.9 వేలకుపైగా రావాలంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ కూరగాయ సాగు రైతును ధనవంతున్ని చేసింది.. రైతుకు సీఎం సత్కారం..!
ఈ కూరగాయ సాగు రైతును ధనవంతున్ని చేసింది.. రైతుకు సీఎం సత్కారం..!
ఈ నెలలోనే పవిత్ర గంగా దసరా.. సక్సెస్, సుఖ,సంతోషాల కోసం చేయాల్సిన
ఈ నెలలోనే పవిత్ర గంగా దసరా.. సక్సెస్, సుఖ,సంతోషాల కోసం చేయాల్సిన
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..
933 బంతుల్లో 100 సిక్సర్లతో కోహ్లీ ఫ్రెండ్ దూకుడు..
933 బంతుల్లో 100 సిక్సర్లతో కోహ్లీ ఫ్రెండ్ దూకుడు..
బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని..
బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని..
‘మేం కాప్‌లం’ రివ్యూ.. నాగబాబు, గెటప్ శ్రీను మ్యాజిక్ చేశారా?
‘మేం కాప్‌లం’ రివ్యూ.. నాగబాబు, గెటప్ శ్రీను మ్యాజిక్ చేశారా?
పొయ్యి లేకుండానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన ఫుడ్..
పొయ్యి లేకుండానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన ఫుడ్..
ఓరీ దేవుడో.. ఎయిర్ కూలర్లు బాంబులా పేలుతున్నాయి? ఈ తప్పులే కారణం!
ఓరీ దేవుడో.. ఎయిర్ కూలర్లు బాంబులా పేలుతున్నాయి? ఈ తప్పులే కారణం!
మీరు వాడే పసుపు అసలైనదేనా..! కల్తీని ఇంట్లోనే చిటికెలో ఇలా కనిపెట
మీరు వాడే పసుపు అసలైనదేనా..! కల్తీని ఇంట్లోనే చిటికెలో ఇలా కనిపెట
భార్యాభర్తలను వేరు చేసే ఈ కూరగాయ మొక్క ఇంట్లో అస్సలు ఉండకూడదు..
భార్యాభర్తలను వేరు చేసే ఈ కూరగాయ మొక్క ఇంట్లో అస్సలు ఉండకూడదు..