AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: పోస్టాఫీసులో నెలకు రూ.9 వేలకుపైగా రావాలంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలి?

Post Office: ఈ పథకంలోని పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉండదు. అంతేకాకుండా సంపాదించిన వడ్డీ పెట్టుబడిదారుని ఆదాయానికి జోడిస్తారు. వారి పన్ను శ్లాబ్ ప్రకారం.. పన్ను విధిస్తారు. అయితే పోస్ట్ ఆఫీస్ టీడీఎస్ (TDS) మినహాయించదు. దీనివల్ల పెట్టుబడిదారులు పూర్తి మొత్తాన్ని పొందవచ్చు..

Post Office: పోస్టాఫీసులో నెలకు రూ.9 వేలకుపైగా రావాలంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలి?
Post Office: క్రమమైన పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. కానీ వాటిలో నష్టభయం కూడా ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు, బాండ్లు, బ్యాంకు డిపాజిట్ పథకాలు మొదలైన పెట్టుబడులు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. వీటిలో నష్టభయం తక్కువగా ఉంటుందని అంటారు.
Subhash Goud
|

Updated on: May 23, 2026 | 3:10 PM

Share

Post Office: ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని కోరుకునే భారతదేశంలోని పెట్టుబడిదారులలో పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) చాలా ప్రజాదరణ పొందింది. మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి సురక్షితంగా ఉంటూ స్థిరమైన రాబడిని ఆశించే పదవీ విరమణ చేసిన వ్యక్తులకు, పెట్టుబడిదారులకు ఈ పథకం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ప్రభుత్వ చిన్న పొదుపు పథకానికి స్థిరమైన పెట్టుబడి పరిమితి ఉంది. ఒకే ఖాతాదారుడు రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఉమ్మడి ఖాతాదారుడు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం, ప్రభుత్వం ఈ పథకంపై 7.4% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఇది ప్రతి నెలా పెట్టుబడిదారుల ఖాతాలకు జమ అవుతుంది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది.

ఇది కూడా చదవండి: SBI: పలు ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..

రూ.15 లక్షలపై నెలసరి ఆదాయం ఎంత?

ఒక పెట్టుబడిదారుడు జాయింట్ అకౌంట్‌ కింద రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే అతనికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం లభిస్తుంది.

ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం:

  • మొత్తం పెట్టుబడి: రూ. 15,00,000
  • నెలవారీ ఆదాయం: సుమారు రూ. 9,249
  • వార్షిక వడ్డీ: సుమారు రూ. 1,11,000

ఈ విధంగా, మొత్తం 5 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారుడు సుమారుగా రూ.555,000 వడ్డీని పొందుతాడు. అంటే ఈ పథకం ఎటువంటి నష్టం లేకుండా క్రమమైన నెలవారీ ఆదాయానికి స్థిరమైన వనరుగా మారుతుంది.

పెట్టుబడి కాలం, నియమాలు:

POMIS మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. పెట్టుబడి పెట్టిన ఒక సంవత్సరం లోపు డబ్బు విత్‌డ్రా చేయడానికి అనుమతి లేదు. ఖాతాను మూడు సంవత్సరాలలోపు మూసివేస్తే 2% రుసుము తీసివేయబడుతుంది. అయితే, ఖాతాను మూడు సంవత్సరాల తర్వాత మూసివేస్తే 1% రుసుము కట్‌ అవుతుంది.

పన్ను నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

ఈ పథకంలోని పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉండదు. అంతేకాకుండా సంపాదించిన వడ్డీ పెట్టుబడిదారుని ఆదాయానికి జోడిస్తారు. వారి పన్ను శ్లాబ్ ప్రకారం.. పన్ను విధిస్తారు. అయితే పోస్ట్ ఆఫీస్ టీడీఎస్ (TDS) మినహాయించదు. దీనివల్ల పెట్టుబడిదారులు పూర్తి మొత్తాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత? కొత్త రూల్స్ ఎఫెక్ట్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు