AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని ఆసక్తికర విషయాలు

Cheek Dimples Meaning: సాముద్రిక శాస్త్రం ప్రకారం ముఖ లక్షణాలు (కళ్లు, ముక్కు, చెంపలు, నుదురు) ఆధారంగా వ్యక్తి స్వభావం, అదృష్టం వంటివి అంచనా వేయవచ్చని ఒక నమ్మకం ఉంది. ఇందులో చెంపలపై కనిపించే డింపుల్స్‌ను ఆకర్షణతో పాటు అదృష్ట సూచకంగా కూడా భావిస్తారు. నవ్వినప్పుడు కనిపించే ఈ సొట్టలు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయని అంటారు.

బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని ఆసక్తికర విషయాలు
Cheek Dimples Meaning
Rajashekher G
|

Updated on: May 23, 2026 | 5:37 PM

Share

సాముద్రిక శాస్త్రం ప్రకారం వ్యక్తి ముఖ లక్షణాలు.. కళ్ల తీరు, నుదురు ఆకృతి, ముక్కు, చెంపలు వంటి వాటిని బట్టి వారి స్వభావం, జీవన విధానం, అదృష్టం వంటి విషయాలను అంచనా వేయవచ్చని ఒక నమ్మకం ఉంది. ఇందులో ముఖ్యంగా చెంపలపై కనిపించే చిన్న సొట్టలు లేదా డింపుల్స్ కేవలం ఆకర్షణను పెంచడమే కాకుండా అదృష్ట సూచకంగా కూడా భావిస్తారు. అందుకే అలాంటి లక్షణం ఉన్నవారిని కొందరు ప్రత్యేకంగా గమనిస్తారు. నవ్వినప్పుడు కనిపించే ఈ సొట్టలు ముఖానికి అందాన్ని పెంచడమే కాకుండా వ్యక్తిత్వానికి ప్రత్యేకతను ఇస్తాయని చెబుతారు.

ప్రత్యేక ఆకర్షణగా..

జ్యోతిష్య శాస్త్రం, సాముద్రిక శాస్త్ర విశ్వాసాల ప్రకారం చెంపలపై సొట్టలు ఉన్నవారు సాధారణంగా ఆకర్షణీయమైన స్వభావం కలిగి ఉంటారని భావిస్తారు. వీరు సరదాగా, ఉల్లాసంగా ఉండే మనస్తత్వం కలవారు. ఇతరులతో సులభంగా కలిసిపోవడం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండటం వీరి ప్రత్యేకతగా చెబుతారు. వీరి మాటతీరు, ప్రవర్తన ఇతరులను త్వరగా ఆకట్టుకుంటుందని కూడా నమ్మకం ఉంది. ఈ కారణంగా వీరికి స్నేహితులు, పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయని అంటారు.

సొట్ట బుగ్గలు శుభసూచకమే..

ప్రత్యేకంగా మహిళల విషయంలో చెంపలపై సొట్టలు ఉంటే అది శుభ సూచకమని పాత విశ్వాసాలు చెబుతాయి. అలాంటి మహిళలు ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంటికి ఆనందం, శాంతి, సౌభాగ్యం వస్తాయని పెద్దలు నమ్ముతారు. కొన్ని పురాణ కథనాల్లో కూడా ఇలాంటి లక్షణం ఉన్న స్త్రీలు ప్రేమతో, సౌమ్యంగా జీవిస్తారని పేర్కొన్నట్లు చెప్పబడుతుంది. వారు కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటారని, సంబంధాలను గౌరవంగా కొనసాగిస్తారని భావిస్తారు. దాంతో వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగుతుందని నమ్మకం ఉంది.

సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి ప్రతీక

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం చెంపలపై సొట్టలు ఉండటం శుక్ర గ్రహ అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. శుక్రుడు అందం, ప్రేమ, సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి ప్రతీకగా పరిగణించబడతాడు. అందువల్ల ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి జీవితంలో సౌకర్యాలు, ఆర్థిక స్థిరత్వం, మంచి సంబంధాలు ఎక్కువగా ఉంటాయని విశ్వసిస్తారు. అలాగే వీరు కళలు, ఫ్యాషన్, మీడియా, వినోద రంగాల్లో మంచి ప్రతిభ చూపే అవకాశం ఉందని కూడా చెబుతారు.

మొత్తానికి, చెంపలపై సొట్టలు ఉన్నవారు జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకునే స్వభావం కలవారని, చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషాన్ని కనుగొంటారని భావిస్తారు. ఇతరులను నవ్వించడం, సానుకూలంగా మాట్లాడటం వీరి సహజ లక్షణంగా చెబుతారు. వీరి ఉల్లాసభరితమైన స్వభావం చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచుతుందని నమ్మకం ఉంది. అయితే ఇవన్నీ పూర్తిగా సాముద్రిక శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన అభిప్రాయాలే మాత్రమే.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాముద్రికా శాస్త్రం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని..
బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని..
‘మేం కాప్‌లం’ రివ్యూ.. నాగబాబు, గెటప్ శ్రీను మ్యాజిక్ చేశారా?
‘మేం కాప్‌లం’ రివ్యూ.. నాగబాబు, గెటప్ శ్రీను మ్యాజిక్ చేశారా?
పొయ్యి లేకుండానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన ఫుడ్..
పొయ్యి లేకుండానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన ఫుడ్..
ఓరీ దేవుడో.. ఎయిర్ కూలర్లు బాంబులా పేలుతున్నాయి? ఈ తప్పులే కారణం!
ఓరీ దేవుడో.. ఎయిర్ కూలర్లు బాంబులా పేలుతున్నాయి? ఈ తప్పులే కారణం!
మీరు వాడే పసుపు అసలైనదేనా..! కల్తీని ఇంట్లోనే చిటికెలో ఇలా కనిపెట
మీరు వాడే పసుపు అసలైనదేనా..! కల్తీని ఇంట్లోనే చిటికెలో ఇలా కనిపెట
భార్యాభర్తలను వేరు చేసే ఈ కూరగాయ మొక్క ఇంట్లో అస్సలు ఉండకూడదు..
భార్యాభర్తలను వేరు చేసే ఈ కూరగాయ మొక్క ఇంట్లో అస్సలు ఉండకూడదు..
ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..
ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..
ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు
భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు
సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..
సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..