AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Apprentice Recruitment 2026: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు, నెలకు స్టైపెండ్ ఎంతంటే..?

SBI Apprentice Notification 2026: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం అప్రెంటిస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మరి దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి? స్టైపెండ్ ఎంత? వంటి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

SBI Apprentice Recruitment 2026: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు, నెలకు స్టైపెండ్ ఎంతంటే..?
SBI Apprentice Recruitment 2026
Rajashekher G
|

Updated on: May 23, 2026 | 6:13 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాన్ని అందిస్తూ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం అప్రెంటిస్ నియామకాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ రంగంలో శిక్షణతో పాటు ప్రాక్టికల్ అనుభవం పొందే అవకాశం లభిస్తుంది.

మొత్తం ఖాళీలు

  • దేశవ్యాప్తంగా మొత్తం 7,150 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: 709 సీట్లు: (SC – 113, ST – 49, OBC – 191, EWS – 70, UR – 286)
  • తెలంగాణ: 491 సీట్లు: (SC – 78, ST – 34, OBC – 132, EWS – 49, UR – 198)
  • అభ్యర్థులు దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష (తెలుగు/ఉర్దూ) తెలిసి ఉండాలి.

అర్హతలు

  1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి (01.04.2026 నాటికి)
  2. వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య (02.04.1998 – 01.04.2006 మధ్య జననం)
  3. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి
  4. అవసరమైతే భాషా పరీక్ష నిర్వహిస్తారు

ఎంపిక విధానం

  • ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్థానిక భాషా పరీక్ష
  • రాత పరీక్ష వివరాలు: మొత్తం: 100 మార్కులు

విభాగాలు:

  • రీజనింగ్
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
  • జనరల్ అవేర్‌నెస్ & ఫైనాన్షియల్ అవేర్‌నెస్
  • ఇంగ్లీష్ & కంప్యూటర్ అవగాహన
  • ప్రతి విభాగానికి 25 ప్రశ్నలు
  • పరీక్ష సమయం: 60 నిమిషాలు
  • నెగిటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు

మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి, తరువాత స్థానిక భాషా పరీక్షకు పిలుస్తారు. 10వ తరగతి లేదా ఇంటర్‌లో స్థానిక భాష చదివిన ఆధారాలు ఉంటే మినహాయింపు ఉంటుంది.

శిక్షణ & స్టైపెండ్

  • శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం
  • నెలవారీ స్టైపెండ్: రూ.15,000
  • అదనపు అలవెన్సులు ఉండవు

దరఖాస్తు ఫీజు

  • జనరల్ / OBC / EWS: రూ.300
  • SC / ST / దివ్యాంగులు: ఫీజు లేదు
  • ఫీజు చెల్లించిన తర్వాత రీఫండ్ ఉండదు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 19.05.2026
  • చివరి తేదీ: 08.06.2026
  • పరీక్ష: జూలైలో జరిగే అవకాశం

దరఖాస్తు విధానం

  • పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి
  • ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
  • ముందుగా NAPS పోర్టల్‌లో నమోదు అవసరం
  • ఆ తర్వాత SBI కెరీర్స్ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి
  • వ్యక్తిగత, విద్యా వివరాలు నమోదు చేసి, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి

పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి (విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లో). ఇది బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్లకు మంచి శిక్షణ అవకాశంగా చెప్పవచ్చు.

అభ్యర్థులు ముందుగా అధికారిక ఎన్‌ఏపీఎస్‌ (NAPS) పోర్టల్ (www.apprenticeshipindia.gov.in)లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ (sbi.bank.in/web/careers లేదా sbi.bank.in/web/careers/current-openings) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ కోసం​ ఇక్కడ క్లిక్​ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్
ఈ కూరగాయ సాగు రైతును ధనవంతున్ని చేసింది.. రైతుకు సీఎం సత్కారం..!
ఈ కూరగాయ సాగు రైతును ధనవంతున్ని చేసింది.. రైతుకు సీఎం సత్కారం..!
ఈ నెలలోనే పవిత్ర గంగా దసరా.. సక్సెస్, సుఖ,సంతోషాల కోసం చేయాల్సిన
ఈ నెలలోనే పవిత్ర గంగా దసరా.. సక్సెస్, సుఖ,సంతోషాల కోసం చేయాల్సిన
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..
933 బంతుల్లో 100 సిక్సర్లతో కోహ్లీ ఫ్రెండ్ దూకుడు..
933 బంతుల్లో 100 సిక్సర్లతో కోహ్లీ ఫ్రెండ్ దూకుడు..
బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని..
బుగ్గ సొట్ట ఉన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం నిజమేనా? మీకు తెలియని..
‘మేం కాప్‌లం’ రివ్యూ.. నాగబాబు, గెటప్ శ్రీను మ్యాజిక్ చేశారా?
‘మేం కాప్‌లం’ రివ్యూ.. నాగబాబు, గెటప్ శ్రీను మ్యాజిక్ చేశారా?
పొయ్యి లేకుండానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన ఫుడ్..
పొయ్యి లేకుండానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన ఫుడ్..