AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌ వాసులకు దెబ్బే.. రెండో స్థానంలో..

తాజాగా కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యులపై భారం పడుతుండగా.. సిలిండర్ కోసం హైదరాబాద్ ప్రజలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ధర హైదరాబాద్‌లో ఉంది.

Gas Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌ వాసులకు దెబ్బే.. రెండో స్థానంలో..
Lpg Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Jun 08, 2026 | 3:35 PM

Share

దేశంలోని సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఈ ఏడాదిలో రెండోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజాగా కేంద్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌కు రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో ఇది రెండో పెంపుగా చెప్పవచ్చు. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగింది. హర్ముజ్ జలసంధి కూడా మూతపడిన క్రమంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో మార్చి 7న ఇంటి అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 60 పెంచగా.. ఇప్పుడు రెండోసారి పెంచింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి ఎల్‌పిజి సిలిండర్‌పై సుమారు రూ. 703 నష్టపోతున్నాయి. దీంతో పెంచక తప్పని పరిస్థతి ఏర్పడిందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ రెండో స్థానం

ఈ పెంపు తర్వాత దేశంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ల ధర ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఒక్కొలా రేట్లు ఉంటాయి. రవాణా ఖర్చులు, రాష్ట్రాలు విధించే ట్యాక్సుల వల్ల ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అత్యధిక ధర బీహార్ రాజధాని పాట్నాలో ఉంది. అక్కడ సిలిండర్ ధర రూ.1030.50గా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.994గా ఉంది. అంటే రూ.వెయ్యి చేరువలో ఉందని చెప్పవచ్చు. ఇక ఢిల్లీలో రూ.942, బెంగళూరులో రూ.644, చెన్నైలో రూ.957, కోల్‌కత్తాలో రూ.968గా ఉంది. ఒక ముంబైలో రూ.941 పలుకుతుండగా.. జైపూర్‌లో రూ.945కే లభిస్తుంది. హైదరాబాద్‌లో ఎక్కువ ధర ఉండటంతో.. నగరవాసులు ఎక్కువ ఖర్చు పెట్టా్ల్సి వస్తోంది. నగరంలో నివసించే వలసదారులు, సామాన్యులకు ఇది బ్యాడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.

మూడు నెలల వ్యవధిలో..

మూడు నెలల వ్యవధిలో సిలిండర్‌పై ఏకంగా రూ.89 మేర పెరిగింది. ఈ పెరిగిన ధరలతో ఏడాదికి అదనంగా ఒక్కొ సిలిండర్‌పై రూ.1068 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు వాడేవారిపై మరింత భారం పడనుంది. భారత్ ఎక్కువగా విదేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుంది. దేశంలో గ్యాస్ నిల్వలు లేకపోవడంతో ధరలు పెరుుతున్నాయి. ఇటీవల రెండు నెలల పాటు గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాణిజ్య సిలిండర్ ధరల సరఫరా పూర్తిగా నిలిపివేయగా.. డొమెస్టిక్ గ్యాస్ డెలివరీకి సంబంధించి పలు పరిమితులు విధించారు. ఒక గ్యాస్ బుక్ చేసుకున్న 25 రోజుల తర్వాత నగరాల్లో గ్యాక్ బుక్ చేసుకునే వెయిటింగ్ పీరియడ్ విధించారు.

Follow Us