AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకేరోజు విడుదలకు సిద్దమైన ది ప్యారడైజ్, ఇరుముడి.. ఆ హీరో సినిమా వాయిదా తప్పదా.?

ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అనేది చాలా కామన్. పండగ సీజన్, లేదా సమ్మర్ సమయంలో ఒకేసారి మూడు నాలుగు బడా సినిమాలు విడుదలవుతాయి. కొన్నిసార్లు పోటీ ఎక్కువైతే కొన్ని సినిమాలు వాయిదా కూడా పడతాయి.

ఒకేరోజు విడుదలకు సిద్దమైన ది ప్యారడైజ్, ఇరుముడి.. ఆ హీరో సినిమా వాయిదా తప్పదా.?
Nani, Raviteja
Rajeev Rayala
|

Updated on: Jun 08, 2026 | 3:09 PM

Share

ఈ సమ్మర్ లో పెద్దగా బడా సినిమాల సందడి కనిపించలేదు. సంక్రాంతి నాలుగు, ఐదు సినిమాలు విడుదలై సందడి చేశాయి. కానీ సమ్మర్ లో మాత్రం పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు.. ఈ నెలలో విడుదలైన ఏకంగా పెద్ద సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే భారీ కలెక్షన్స్ వసూల్ చేసుకుంటూ రాణిస్తుంది పెద్ది సినిమా ఇక ఇప్పుడు రెండు బడా సినిమాలు ఒకేసారి థియేటర్స్ లో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు నెలలో విడుదల కానున్న బడా సినిమాలు మరేవో కాదు. నాని ది ప్యారడైజ్, అలాగే రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమా.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న నయా మూవీ ది ప్యారడైజ్. రీసెంట్ డేస్ లో నాని వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. దసరా సినిమా దగ్గర నుంచి వరుసగా హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో హిట్స్ అందుకుంటున్నాడు నాని. ఇక ఇప్పుడు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో మాస్ సినిమా చేస్తున్నాడు అదే ది ప్యారడైజ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ భారీ హిట్ అయ్యింది. ఈ సినిమా ఆగస్టులో విడుదల చేయనున్నారు. ఆగస్టు 21న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక రవితేజ నటిస్తున్న ఇరుముడి సినిమా కూడా అదే తేదీన విడుదల చేయనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా ఇరుముడి. ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమాలో రవితేజ గతంలో ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ప్యారడైజ్, ఇరుముడి సినిమాలు రెండు ఒకే రోజు బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ భారీ క్లాష్ నేపథ్యంలో నాని సినిమా పోస్టుపోన్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!