Karbonn Smart TV: మార్కెట్లోకి కార్బన్ స్మార్ట్ టీవీలు రానున్నాయి.. ధర ఎంత ఉండనున్నాయో తెలుసా.?
Karbonn Smart TV: భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ కార్బన్ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్‌లో తక్కువ ధరలో స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలను తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్ డిజిటల్‌తో..

Karbonn Smart TV: భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ కార్బన్ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్‌లో తక్కువ ధరలో స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలను తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్ డిజిటల్‌తో జతకట్టనుంది. ఈ విషయమై కార్బన్ ఎండీ ప్రదీప్ జైన్ అధికారిక ప్రకటన చేశారు. భారత్‌లో న్యూ రేంజ్ స్మార్ట్ టీవీల విక్రయానికి రిలయన్స్ డిజిటల్‌తో చేతులు కలిపామని ప్రదీప్ తెలిపారు. వినియోగదారులకు అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలను అత్యంత తక్కువ ధరకు అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక కార్బన్ టీవీల ధర విషయానికొస్తే ప్రారంభం ధర రూ. 7990 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా కార్బన్ ఇప్పటికే మూడు మోడళ్లను రూపొందించింది. మరికొన్ని రోజుల్లోనే ఈ టీవీలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. కార్బన్ స్మార్ట్ టీవీలకు సంబంధించిన అన్ని రకాల ఫీచర్లతో పాటు ధరల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ టీవీలు వినియోగదారులను ఏమేర ఆకట్టుకుంటాయో చూడాలి.
IPL 2022: షాకివ్వనున్న బీసీసీఐ కొత్త రూల్స్.. పాటించకుంటే కోత.. ఆటగాళ్ల వేతనాలపైనా క్లారిటీ..!
Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె