Huzurabad By Election Exit Poll: గెలుపు నీదా.. నాదా.. ఓటరు దేవుడు ఎటువైపో.. తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్..
హుజురాబాద్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య హోరా హోరా పోరు సాగింది. వార్ ఎలా సాగినా.. ఓటరు దేవుడు ఎటువైపు మొగ్గు చూపాడనే ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై ఆసక్తి నెలకొంది.

నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఎన్నికల ఆఖరి ఘట్టం ముగిసింది. ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు ధాన,ధర్మ, దండోపయాలను ప్రయోగిస్తున్నాయి. అయితే ఇప్పుడు గెలుపు ఎవరిదనేదే ఇప్పుడు ప్రధాన చర్చ మొదలైంది. పాత రికార్డులను బ్రేక్ చేస్తూ పోలింగ్ శాతం సాగింది. హుజురాబాద్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య హోరా హోరా పోరు సాగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా క్యూ లైన్లలో కొవిడ్ రూల్స్ పాటిస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెద్ద ఎత్తునా యువకులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 84.5 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు గెలుపు ఎవరిదని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుచోట్ల భారీగా బెట్టింగ్‌లు కూడా కొనసాగుతున్నాయి.
ఇదిలావుంటే వార్ ఎలా సాగినా.. ఓటరు దేవుడు ఎటువైపు మొగ్గు చూపాడనేదే ఇప్పుడు కీలకంగా మారింది. గెలుపు ఓటములపై కొన్ని ఏజెన్సీలు సర్వే నిర్వహించాయి. వారు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వే వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆత్మసాక్షి.. బీజేపీ-50.5 శాతం టీఆర్‌ఎస్-43.1 శాతం కాంగ్రెస్ -5.7 శాతం
‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే..
- హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపికి స్పష్టమైన మొగ్గు
- బిజెపి-టిఆర్ఎస్ మధ్య 7-9 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే ఛాన్స్
- మార్జిన్ అఫ్ ఎర్రర్ + (ప్లస్) ఆర్ – (మైనస్) 3 శాతం
- కాంగ్రెస్ (మైనస్)
- సామాజికవర్గాలు… ముఖ్యంగా యువత మద్దతు బిజెపి వైపే..
భారీగా జరిగిన పోలింగ్‌తో పార్టీల్లో కొత్త టెన్షన్ మొదలైంది. పెరిగిన ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సర్వేసంస్థలు, ఇంటెలిజెన్స్ కూడా ఓటరు నాడిని పట్టలేకపోతున్నాయి. ప్రజా తీర్పుని అంచనా వేయడం కష్టంగా మారింది.
ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..
Surat Sarees: చీరల వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. సూరత్‌లో పెరుగనున్న ధరలు.. ఎంత పెరుగొచ్చంటే..
PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..