Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Jaggareddy: కేసీఆర్‌ రెండు రాష్ట్రాలను కలుపుతా అంటే మద్దతిస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

MLA Jaggareddy Comments: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ట ఈపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన..

MLA Jaggareddy: కేసీఆర్‌ రెండు రాష్ట్రాలను కలుపుతా అంటే మద్దతిస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Follow us
Subhash Goud

|

Updated on: Oct 30, 2021 | 9:07 PM

MLA Jaggareddy Comments: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ట ఈపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన రాజకీయంగా జరుగుతోందని అన్నారు. గాంధీభవన్ వేదికగా చిట్‌చాట్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమైక్యాంధ్ర అంటూ ఏపీ తెలంగాణ నేతలు కుట్రకు తెర లేపుతున్నారంటూ ఆయన టీఆర్ఎస్ పై మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి సమైక్యాంధ్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకవేళ తెలుగు రాష్ట్రాలను కలుపుతానంటే తన మద్దతు ఉంటుందని, నా స్టాండ్‌ మొదటి నుంచి సమైఖ్య రాష్ట్రమేనని అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తాను సమైక్యాంధ్ర ఉన్నప్పుడే చెప్పానని, మరోవైపు సమైక్య రాష్ట్రం పేరుమీద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికార పార్టీలు కొత్త డ్రామాకు తెరలేపాయని ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోవద్దని పార్టీలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. ఇక రేవంత్ రెడ్డికి తన అభిప్రాయాన్ని అడ్డుకునే హక్కు లేదని, తాను ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర అంటే తప్పుబట్టారని ఇప్పుడు సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఏలా అర్థం చేసుకోవాలని అని అన్నారు.

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లీనరీలో ఏపీలో పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అయోమయయానికి గురి చేసే విధంగా ఉన్నాయని అన్నారు. మరోవైపు బీజేపీ ఈ విషయంలో గోడమీద పిల్లిలాంటిదని ఎటు వీలైతే అటు అనుకూలంగా మాట్లాడుతుందని వ్యాఖ్యానించారు. పీసీసీ ప్రసిడెంట్‌గా రేవంత్‌ రెడ్డి ఎవరి తాటైనా తీసుకోని.. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని అడ్డుకునే అర్హత రేవంత్‌కు లేదన్నారు. ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు.. ఆత్మబలిదానం చేసుకున్నవారు కోరుకున్నట్లు తెలంగాణ లేదన్నారు. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ పార్టీ పెట్టకుండా రెండు రాష్ట్రాలను కలిపి ఒకే పార్టీగా పరిపాలన చేద్దామని చెప్పడం వెనక కుట్ర దాగుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇరు పార్టీల వ్యాఖ్యలను జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డికి విరుద్దంగా ఆ పార్టీ సీనియర్ నేత వ్యాఖ్యలు చేయడం ఆపార్టీలో ఇద్దరి మధ్య అంతర్గత విభేధాలు సమసిపోలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ కోసం కొట్లాడిన కోదండరాం ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలీదు. సమైక్యరాష్ట్రం పేరుమీద ఏపీ- తెలంగాణ అధికార పార్టీలు కొత్త డ్రామా మొదలుపెట్టాయన్నారు. కేసీఆర్ రాజకీయాలను ప్రజలు గమనించాలి. నేను పార్టీకి అనుకూలంగానే పని చేస్తా అని అన్నారు.

నేను క్షమాపణ చెప్పలేదు..

ఈ క్రమంలోనే గతంలో ఇద్దరి నేతల మధ్య జరిగిన వివాదం నేపథ్యంలోనే తాను రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పినట్టుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పలేదని, కేవలం పార్టీకి మాత్రమే క్షమాపణ చెప్పానని పేర్కొన్నారు. పార్టీని ఇబ్బంది పెట్టెవిధంగా ఉన్నాయని చెప్పడంతో పార్టికి క్షమాపణ చెప్పానని అనడం వెనక ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుందని పార్టీనేతలు భావిస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి:

Huzurabad By Poll: మాదే విజయం.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌..

Post Office Franchise: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ బెనిఫిట్‌..