Post Office Franchise: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ బెనిఫిట్‌..

Post Office Franchise: ఏదైనా బిజినెస్‌ చేసి మంచి లాభాలు పొందేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఇలంటి వారికి మంచి అవకాశం ఉంది. కేవలం రూ.5వేలు..

Post Office Franchise: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ బెనిఫిట్‌..
Follow us
Subhash Goud

|

Updated on: Oct 30, 2021 | 7:23 PM

Post Office Franchise: ఏదైనా బిజినెస్‌ చేసి మంచి లాభాలు పొందేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఇలంటి వారికి మంచి అవకాశం ఉంది. కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్‌ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్‌, అర్బన్‌ ఏరియాల్లో సైతం ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఈ ఫ్రాంఛైజ్‌ స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది.

పోస్టాఫీస్‌ ఫ్రాంఛైజీ తీసుకుంటే స్టాంప్స్‌, స్టేషనరీని అమ్ముకోవచ్చు. అలాగే బుకింగ్‌ రిజిస్టర్డ్‌ ఆర్టికల్స్‌, స్పీడ్‌ పోస్ట్‌ ఆర్టికల్స్‌, మనీ ఆర్డర్స్‌ సర్వీస్‌లను అందించాల్సి ఉంటుంది. పోస్టల్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు. పోస్టాఫీసు పరిధిలోకి వచ్చే రీటైల్‌ సర్వీసులు అంటే బిల్స్‌, ట్యాక్స్‌, పన్నుల వసూళ్లు, చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

కావాల్సిన అర్హతలు

ప్రాంఛైజీని సొంతం చేసుకోవలంటే అందుకు పలు అర్హులు ఉండాల్సి ఉంటుంది, ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే కనీసం 8వ తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్‌ కింద రూ.5 వేలు నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోస్టాఫీసు అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ ప్రధాన అధికారికి పంపిస్తారు. ఆ తర్వాత మీ దరఖాస్తును పరిశీలిస్తారు. మీ ఫ్రాంఛైజీ కోసం దరఖాస్తులు పేర్కొన్న అడ్రస్‌ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్‌ సౌకర్యం ఉందా లేదా అని అనే విషయాలను పరిశీలిస్తారు. అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులా కదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.

ఫ్రాంఛైజీకి ఎవరికి ఇస్తారు.. ఎవ్వరికి ఇవ్వరు..?

ఫ్రాంఛైజీకి అందరికి ఇవ్వరు. 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు. అలాగే పోస్టాఫీసు ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్‌ ఉద్యోగులకు ఈ ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు. పంచాయత్‌ కమ్యూనికేషన్‌ సర్వీస్‌ స్కీమ్‌లో భాగంగా పంచాయత్‌ కమ్యూనికేషన్‌ సర్వీస్‌ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్టాఫీసు ఫ్రాంఛైజీ ఇవ్వరు.

ఎలాంటి లాభాలు ఉంటాయి..

ఈ ఫ్రాంఛైజీ వల్ల పలు లాభాలు ఉంటాయి. ఇందులో నిర్వాహకులు అందించే సేవలపై కమీషన్‌ ఉంటుంది. రిజిస్టర్డ్‌ పోస్ట్‌కు రూ.3, స్పీడ్‌ పోస్టుకు రూ.5 కమీషన్‌ ఉంటుంది. అలాగే రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్‌పై రూ.3.50 నుంచి కమీషన్‌ వస్తుంది. ఇక అంతకన్న ఎక్కువ మనీ ఆర్డర్‌పై రూ.5 వరకు కమీషన్‌ లభిస్తుంది. అలాగే నెలలో 1000 రిజిస్టర్‌ పోస్టులు, 1000 స్పీడ్‌ పోస్టులు బుక్‌ చేసినట్లయితే 20 శాతం వరకు కమీషన్‌ అదనంగా పొందవచ్చు. ఇక మనీ ఆర్డర్‌ ఫామ్‌లు, స్టాంపులు, పోస్టల్‌ స్టేషనరీ అమ్మకాలపై 5 శాతం వరకు కమీషన్‌ పొందవచ్చు. ఇలా ఫ్రాంఛైజీలు తీసుకుంటే ఇలాంటి లాభాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

WhatsApp Pay: వాట్సాప్‌ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌.. ఇక అలా చేస్తే రూ.51 క్యాష్‌బ్యాక్‌..!

Health Insurance: గూగుల్‌ పేతో ఎస్‌బీఐ ఒప్పందం.. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఆరోగ్య బీమా పాలసీ..!