AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Pay: వాట్సాప్‌ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌.. ఇక అలా చేస్తే రూ.51 క్యాష్‌బ్యాక్‌..!

WhatsApp Pay: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే మన దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. యూజర్లను..

WhatsApp Pay: వాట్సాప్‌ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌.. ఇక అలా చేస్తే రూ.51 క్యాష్‌బ్యాక్‌..!
Subhash Goud
|

Updated on: Oct 30, 2021 | 3:21 PM

Share

WhatsApp Pay: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే మన దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు క్యాష్‌బ్యాక్‌ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. గతంలో గూగుల్ పే, ఫోన్ పే అనుసరించిన మార్గానే ఇప్పుడు వాట్సాప్ కూడా అనుసరిస్తోంది. క్యాష్‌బ్యాక్‌లతో వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది. వాట్సాప్‌ చెల్లింపు సేవ నవంబర్ 2020 నుండి భారతదేశంలో అమలులోకి వచ్చింది. ఇది యూపీఐ (UPI)లో మాత్రమే పని చేస్తుంది. వాట్సాప్‌ పేని సెటప్ చేసిన తర్వాత, మీరు చెల్లింపు సేవ ప్రయోజనాన్ని పొందవచ్చు. వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు చేస్తే కస్టమర్లు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్‌ బీటా వినియోగదారులకు ‘గివ్‌ క్యాష్‌, గెట్‌ రూ.51’ పేరుతో బ్యానర్‌ కనిపిస్తుంది. వారు నచ్చిన ఐదుగురికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తే వెంటనే వారికి రూ.51 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇంత మొత్తం పంపాలన్న నిబంధనలేమి లేవు. 1 రూపాయి కూడా పంపినా రూ.51 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. పేమెంట్‌ పూర్తయిన కొద్దిసేపటికే ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తం అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే, క్యాష్‌బ్యాక్‌ సదుపాయం గరిష్ఠంగా ఐదుగురికి పంపడానికే వర్తిస్తుంది.

బీటా యూజర్లకు..

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు ఈ ఆఫర్‌ అందిస్తోంది. త్వరలో అందరికీ ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. పేమెంట్‌ సేవలను ప్రారంభించిన తొలి రోజుల్లో గూగుల్‌ పే కూడా స్క్రాచ్‌ కార్డుల రూపంలో క్యాష్‌బ్యాక్‌ అందించి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకుంది. పేటీఎం, ఫోన్‌ పే సైతం ఇదే దారిలో వెళ్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్‌ సైతం అదే తరహాలో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే ఇండియాలో ఎక్కువ వాడుతున్నారు. భారత్‌లో యూపీఐ ఆధారిత నగదు బదిలీ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ కూడా అదే తరహాలో నడుస్తోంది. క్యాష్‌బ్యాక్ కోసం, వాట్సాప్‌, గూగుల్‌ పే వంటి కార్డులను కూడా పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Indian Railways: గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి వచ్చిన ఎకానమీ AC-3 టైర్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీవాళీ సేల్‌.. స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్‌ ఆఫర్‌..!