AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By Poll: మాదే విజయం.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌..

Huzurabad By Poll: తెలంగాణలోని హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు..

Huzurabad By Poll: మాదే విజయం.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌..
Subhash Goud
|

Updated on: Oct 30, 2021 | 8:33 PM

Share

Huzurabad By Poll: తెలంగాణలోని హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్న ఓటర్లందరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం ప్రకారం బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారందరికి ధన్యవాదాలు అంటూ తెలిపారు.

ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామికంగా వ్యవహరించి ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరించిందని సంజయ్‌ ఆరోపించారు. డబ్బుతో ఓట్లను అడ్డగోలుగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా అసత్యపు ప్రచారాలు, అబద్దపు మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా హుజూరాబాద్‌ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి న్యాయం వైపు వెళ్లారని, ఈటల రాజేందర్‌ వైపే మొగ్గు చూపారని అన్నారు. టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చుపెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు నిష్పక్షపాతంగా న్యాయం, ధర్మం వైపు నిలిచారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా.. అధికార యంత్రాంగంతో బీజేపీపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, మా కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. బీజేపీ కార్యకర్తలు ఎక్కడా అదరక, బెదరక పూర్తి సమయమిచ్చి బీజేపీ విజయం కోసం కృషి చేశారన్నారు.

కేసీఆర్‌ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు ఒక మంచి ఆలోచనతో బీజేపీ పార్టీని ఆదరించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ కోసం గత కొన్ని రోజులుగా బీజేపీ శ్రేణులు అహర్నిశలు శ్రమించి, టీఆర్ఎస్ అక్రమాలను అడ్డుకున్నారని అన్నారు. రాత్రిపగలు పార్టీ విజయం కోసం పాటుపడ్డారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో బీజేపీ శ్రేణులు మరింత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాలని కోరుతున్నా అని బండి సంజయ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

Huzurabad By Election: పోటెత్తిన హుజురాబాద్ ఓటరు దేవుళ్లు.. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..

Goa Elections 2022: మీ చేతగానితనంతో మోడీ బలపడుతున్నారు.. కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు