Huzurabad By Election: పోటెత్తిన హుజురాబాద్ ఓటరు దేవుళ్లు.. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..
చెదురుమదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో పోలింగ్ ప్రశాంతం. అయితే గతంలో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

చెదురుమదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో పోలింగ్ ప్రశాంతం. అయితే గతంలో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్లు భారీగా పోటెత్తారు. ప్రతి పోలింగ్‌స్టేషన్లోనూ పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే సీన్. కొన్నిచోట్ల అయితే రాత్రి 7 దాటిన తర్వాత కూడా ఓటర్లు క్యూల్లో నిల్చున్నారు. హుజురాబాద్‌లో మార్నింగ్ 7 నుంచే పోలింగ్ మీటర్ ఓ రేంజ్‌లో పరుగులు పెట్టింది. గంట గంటకూ ఓటింగ్ శాతం పెరిగిపోయింది. సాయంత్రం 5 గంటల వరకే 76.26 శాతం పోలింగ్ నమోదైందంటే జోష్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సేమ్ సీన్. ప్రతి పోలింగ్‌కేంద్రంలోనూ భారీ క్యూలైన్లు. ఇదే ఊపు రాత్రి వరకూ కంటిన్యూ అయింది. .ప్రతి గంటకు దాదాపు 8 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకే 10.50 శాతం ఓటింగ్ జరిగింది. 11 గంటలకు 33, మధ్యాహ్నం ఒంటిగంటకు 45 శాతం సాయంత్రానికి 76 శాతం ఇలా పెరుగుతూ వచ్చింది.
భారీగా జరిగిన పోలింగ్‌తో పార్టీల్లో కొత్త టెన్షన్ మొదలైంది. పెరిగిన ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సర్వేసంస్థలు, ఇంటెలిజెన్స్ కూడా ఓటరు నాడిని పట్టలేకపోతున్నాయి. ప్రజా తీర్పుని అంచనా వేయడం కష్టంగా మారింది.
బరిలో 30 మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలా నడించింది. రెండు పార్టీలు సై అంటే సై అన్నాయి. దీంతో ఉదయం పలుచోట్ల టెన్షన్ వాతావరణం కనిపించింది. గొడవలు- ఘర్షణలు, తోపులాటలు- ఉద్రిక్తతల మధ్య బైపోల్ హీట్ రాజేసింది. పలుచోట్ల రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అయినా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..
Surat Sarees: చీరల వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. సూరత్‌లో పెరుగనున్న ధరలు.. ఎంత పెరుగొచ్చంటే..
PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..