IOC Profits: లాభాల బాటలో ఐఓసీ.. షేర్ హోల్డర్లకు దీపావళి కానుక ప్రకటన.. ఎంత లాభం వచ్చిందంటే..

దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ త్రైమాసికంలో ఎంత లాభపడిందో శనివారం వెల్లడించింది. కంపెనీ ప్రకటన ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో లాభాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.

IOC Profits: లాభాల బాటలో ఐఓసీ.. షేర్ హోల్డర్లకు దీపావళి కానుక ప్రకటన.. ఎంత లాభం వచ్చిందంటే..
Ioc Profits
Follow us
KVD Varma

|

Updated on: Oct 31, 2021 | 7:40 AM

IOC Profits: దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ త్రైమాసికంలో ఎంత లాభపడిందో శనివారం వెల్లడించింది. కంపెనీ ప్రకటన ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో లాభాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కంపెనీ ఈ లాభానికి దాని అత్యుత్తమ కార్యాచరణ పనితీరు కారణమని పేర్కొంది. రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.6,360.05 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

రెండో త్రైమాసికంలో ఒక్కో షేరుపై దాదాపు రూ.6.93 లాభాన్ని ఆర్జించినట్లు ఐఓసీ వెల్లడించింది. మొత్తం లాభం కలిపితే, ఈ నికర లాభం 6,360.05 కోట్లకు చేరుకుంది. ఈ లాభం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం 6,227.31 కోట్లు. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.6.78 లాభం వచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చిన ఫైలింగ్ ప్రకారం, ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఆర్థిక పునరుద్ధరణ సంకేతాలు

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఐఓసీ రూ.5,941.37 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఇన్వెంటరీ లాభాలు తక్కువగా నమోదవడంతో ఈ లాభాల రేటు స్వల్పంగా ఉంది. గత సంవత్సరం రెండవ త్రైమాసికంలో, ఇన్వెంటరీ లాభాలు విపరీతంగా ఉన్నాయి. దీని కారణంగా కంపెనీ లాభం కూడా బాగా పెరిగింది. ఆ కంపెనీ ముడి చమురు వంటి ముడి పదార్థాలను నిర్ణీత రేటుతో కొనుగోలు చేసినప్పుడు సంస్థ ఇన్వెంటరీ లాభాలు మరింత పెరుగుతాయి. తరువాత ఈ ముడి చమురుతో పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఖరీదు కావడంతో పెట్రోల్, డీజిల్ కూడా ఖరీదైంది. దీని కారణంగా ఇన్వెంటరీ లాభం గతంతో పోలిస్తే తగ్గింది.

ఎంత ఆదాయం పెరిగింది

ఐఓసీ(IOC) లెక్కల ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 190 లక్షల టన్నుల ఇంధనాన్ని విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ పరిమాణం 177 లక్షల టన్నులు ఎక్కువ. కోవిడ్ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. దీని ప్రకారం, చమురు డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో, రిఫైనరీలు సుమారు 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ఇంధనంగా మార్చాయి. గతేడాది ఇది 130 లక్షల టన్నులకు పైగా ఉంది. గతేడాదితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగడంతో ఐఓసీ ఆదాయాలు కూడా 46% పెరిగాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నిర్వహణ పనితీరు కూడా 50 శాతం పెరిగింది.

వాటాదారులకు దీపావళి బహుమతి

ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండ్‌ను 50 శాతం లేదా రూ.5 పెంచేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని ఐఓసీ తెలిపింది. ఈ నిర్ణయం 2021-22 కోసం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కంపెనీ నికర లాభం 51 శాతం పెరిగి రూ.12,301.42 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్-సెప్టెంబర్ అర్ధ సంవత్సరంలో కంపెనీ రూ. 3.24 లక్షల కోట్లను ఆర్జించింది, ఇది గత ఏడాది 2.04 లక్షల కోట్లతో పోలిస్తే 51% ఎక్కువ. గణాంకాల ప్రకారం, ముడి చమురును పెట్రోల్-డీజిల్ వంటి ఇంధనంగా మార్చడం ద్వారా IOC బ్యారెల్‌కు సుమారు 6.57 డాలర్లు సంపాదించింది. ఇది దాదాపు రూ.500కి సమానం.

పెట్రోల్, డీజిల్‌తో పాటు, ఐఓసీ ఎల్పీజీ (LPG) కూడా విక్రయిస్తుంది. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా ఇంధన విక్రయాలు బాగా దెబ్బతిన్నాయని కంపెనీ తెలిపింది. ఇప్పుడు లాక్‌డౌన్ ముగిసినందున, అమ్మకాల్లో స్థిరమైన మెరుగుదల ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్‌లో కంపెనీకి వచ్చిన మంచి ఆదాయాలను బట్టి ఇప్పుడు ఇంధనానికి డిమాండ్ పూర్తిగా ట్రాక్‌లోకి వచ్చిందని స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

Rahul Gandhi: మోటర్ సైకిల్‌ టాక్సీపై రాహుల్.. గోవా ఎన్నికల ప్రచార పర్వానికి ముందు ఇలా..

Postal Jobs: ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల భర్తీ..