AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays November 2021: వారంలో ఐదు రోజులు బ్యాంకులు బంద్.. నవంబర్‏లో హాలీడేస్ ఎన్నంటే..

నవంబర్ నెలలో బ్యాంకులకు వరుస హాలీడేస్ వచ్చాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వారంలో

Bank Holidays November 2021: వారంలో ఐదు రోజులు బ్యాంకులు బంద్.. నవంబర్‏లో హాలీడేస్ ఎన్నంటే..
Bank Holidays
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2021 | 7:49 AM

Share

నవంబర్ నెలలో బ్యాంకులకు వరుస హాలీడేస్ వచ్చాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వారంలో ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెలలో పూర్తిగా ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. దీపావళి.. భాయ్ దూజ్ వంటి పండగలతో దేశం మొత్తంలో ఉన్న బ్యాంకులకు వరుస హాలీడేస్ వచ్చాయి. ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు పనిచేయవు.. దీంతో ఏదైనా పని మీద బ్యాంకులకు వెళ్లేవారు ముందుగానే బ్యాంకు హాలీడేస్ తెలుసుకొని వెళ్లడం కరెక్ట్.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బ్యాంకు సెలవులు ఈ నెలలో 17 రోజులు ఉండనున్నాయి. అయితే కొన్ని జాతీయ సెలవులు మినహా.. శని, ఆదివారాలు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవులలో మార్పులు రావచ్చు. బ్బ్యాంకులకు మూడు కేటగిరీల్లో సెలవులు మంజూరు చేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అవి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్ అకౌంట్స్ క్లోజింగ్. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులతో సహా దేశవ్యాప్తంగా ప్రతి బ్యాంకు ఈ నిర్ణీత రోజులలో మూసివేయబడతాయి.

నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవ / కుట్ – బెంగళూరు, ఇంఫాల్ వంబర్ 3: నరక చతుర్దశి – బెంగళూరు నవంబర్ 4: దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ)/దీపావళి/కాళీ పూజ నవంబర్ 5: దీపావళి (బలి ప్రతిపాద) / విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే / గోవర్ధన్ పూజ నవంబర్ 6: భాయ్ దూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చకౌబా – గాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో మరియు సిమ్లా వివిధ రాష్ట్రాల వారీగా సెలవులు కాకుండా. వారాంతాల్లో కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఇవి క్రింద పేర్కొనబడ్డాయి: నవంబర్ 7: ఆదివారం నవంబర్ 13: నెలలో రెండవ శనివారం నవంబర్ 14: ఆదివారం నవంబర్ 19: గురునానక్ జయంతి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు) నవంబర్ 21: ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు) నవంబర్ 22: కనకదాస జయంతి (బెంగళూరు) నవంబర్ 23: సెంగ్ కుత్స్‌నెమ్ (షిల్లాంగ్) నవంబర్ 27: నాలుగో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు) నవంబర్ 28: ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)

Also Read: Puneeth Raj Kumar: ముగిసిన పునీత్ అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు

Puneeth Raj Kumar: మొదలైన అప్పు అంతిమ యాత్ర.. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరగనున్న పునీత్ అంత్యక్రియలు..