AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Rates: ఎఫ్‌డీలపై రాబడికి అనుగుణంగా బీమా సౌకర్యం.. ఆ బ్యాంకుల్లో అదిరిపోయే వడ్డీ రేట్లతో పాటు బీమా

డిపాజిట్‌ని తిరిగి చెల్లించడంలో బ్యాంకు విఫలమైతే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్ (డీఐసీజీసీ) అందించే రూ. 5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు పోటీ ఎఫ్‌డీ రేట్లను అందిస్తాయి.

FD Rates:  ఎఫ్‌డీలపై రాబడికి అనుగుణంగా బీమా సౌకర్యం.. ఆ బ్యాంకుల్లో అదిరిపోయే వడ్డీ రేట్లతో పాటు బీమా
Cash
Nikhil
|

Updated on: Mar 05, 2024 | 7:45 PM

Share

స్థిరత్వం, భద్రతను కోరుకునే పెట్టుబడిదారులలో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ఇష్టపడే ఎంపికగా ఉంటాయి. హామీ ఇచ్చే రాబడితో పాటు ఈ పెట్టుబడులు సురక్షితమైనవిగా పరిగణిస్తారు.   కాబట్టి ఆయా బ్యాంకుల్లో ఎఫ్‌డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

  • ఆర్‌బీఎల్ బ్యాంక్ 546 రోజుల నుంచి 24 నెలల వరకు డిపాజిట్లపై 8.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 
  • డీసీబీ బ్యాంక్ 25 నెలల నుంచి 26 నెలల వరకు ఉండే డిపాజిట్లపై 8% వడ్డీ రేటును అందిస్తుంది.
  • ఇండస్ ఇండ్ బ్యాంక్ వివిధ కాలాల కోసం 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 6 నెలల కంటే తక్కువ, 1 సంవత్సరం 6 నెలల నుండి 1 సంవత్సరం 7 నెలల కంటే తక్కువ, 1 సంవత్సరం 7 నెలల వరకు 2 సంవత్సరాల వరకు ఇదే వడ్డీ రేటు అందిస్తుంది. 
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 549 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే డిపాజిట్లకు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 
  • యస్ బ్యాంక్ 18 నెలల నుంచి 24 నెలల లోపు డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ 400 రోజుల పాటు ఉండే డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 
  • బ్యాంక్ ఆఫ్ బరోడా 2 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 3 సంవత్సరాల వరకు డిపాజిట్లకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 444 రోజులకు 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ సాధారణ వర్గానికి 390 రోజులు నుంచి 23 నెలల కంటే తక్కువ కాలానికి 2.75 శాతం నుండి 7.40 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 18 నెలలు నుంచి 21 నెలల వరకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 
  • ఐసీఐసీఐ బ్యాంక్ 15 నెలలు మరియు 18 నెలల వరకు 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రెండు  సంవత్సరాల వరకు 18 నెలలకు 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • యాక్సిస్ బ్యాంక్ 17 నెలలకు 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 
  • ఎస్‌బీఐ రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 7 శాతం అందిస్తుంది.

బీమా అమలు ఇలా

బ్యాంక్ డిఫాల్ట్ లేదా దివాలా తీసినప్పుడు వారి డిపాజిట్లు రూ. 5 లక్షల వరకు బీమా చేయబడతాయని బ్యాంక్ కస్టమర్‌లు తెలుసుకోవాలి. ఈ భీమా కవరేజీని డీఐసీజీసీ సులభతరం చేస్తుంది. ఇది పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యాజమాన్యంలోని సంస్థ. దేశవ్యాప్తంగా బ్యాంకులకు బీమా బాధ్యత వహిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..