EPFO Investment: ఈపీఎఫ్‌లో పెట్టుబడితో కోటి రూపాయల రాబడి.. అసలైన లెక్క ఇదే
ఉద్యోగుల భవిష్య నిధి అంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించే పదవీ విరమణ ప్రయోజన పథకం. ఈపీఎఫ్ఓ పథకంలో ఉద్యోగి నిర్దిష్ట కంపెనీలో పనిచేస్తున్న సమయంలో యజమాని, ఉద్యోగి ఇద్దరూ ప్రతి నెలా కొంత మొత్తాన్ని విరాళంగా అందిస్తారు. అది పదవి విరమణ సమయంలో ఉద్యోగి చేతికి వస్తుంది. అయితే ఉద్యోగి తన ఈ సహకారంపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
ఉద్యోగుల భవిష్య నిధి అంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించే పదవీ విరమణ ప్రయోజన పథకం. ఈపీఎఫ్ఓ పథకంలో ఉద్యోగి నిర్దిష్ట కంపెనీలో పనిచేస్తున్న సమయంలో యజమాని, ఉద్యోగి ఇద్దరూ ప్రతి నెలా కొంత మొత్తాన్ని విరాళంగా అందిస్తారు. అది పదవి విరమణ సమయంలో ఉద్యోగి చేతికి వస్తుంది. అయితే ఉద్యోగి తన ఈ సహకారంపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పీఎఫ్ వడ్డీ రేటు ఇతర పొదుపు పథకాల కంటే అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు వారి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈపీఎఫ్ఓలో పెట్టుబడి పెడితే రూ. కోటి రూపాయలు ఎలా రాబడి వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం, డియర్ నెస్ అలెవన్స్ (డీఏ)లో 12 శాతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కి జమ చేయవచ్చు. ఉద్యోగుల వాటాతో సమానంగా యాజమాన్యాలు కూడా 12 శాతం విరాళం ఇస్తారు. అయితే యాజమాన్యం వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ ఫండ్ (ఈపీఎస్)కి, 3.67 శాతం ఈపీఎఫ్‌కి వెళుతుంది. అయితే చాలా మంది ఉద్యోగులకు తెలియని విషయం ఏంటంటే ఉద్యోగులకు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ వాటాలో 12 శాతం కంటే ఎక్కువ తీసివేయమని వారి యజమానిని అడగవచ్చు. గరిష్ట వీపీఎఫ్ సహకారం ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 100 శాతం వరకు ఉంటుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో మీ స్వచ్ఛంద, ఒరిజినల్ ఈపీఎఫ్ విరాళాలు రూ. 2.5 లక్షలకు మించి ఉంటే మీరు అదనపు మొత్తంపై సంపాదించిన వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది .
రూ.25 వేల జీతంలో కోటి రూపాయల రాబడి
25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి నెలకు రూ. 25,000 ప్రాథమిక వేతనం రూ. 15,000తో సంపాదిస్తున్నాడనుకుంటే జీతం పెరుగుదల కారణంగా ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ సహకారం 10 శాతం పెరుగుతూ ఉంటుంది. ప్రాథమిక వేతనం రూ. 15,000 ఉంటే ఈపీఎఫ్ సహకారం కింద నెలకు రూ. 2300 కంపెనీ కట్ చేస్తుంది. ఇలా నెలకు రూ. 2300, ప్రతి సంవత్సరం కాంట్రిబ్యూషన్‌లో 10 శాతం పెరుగుదలతో ఈపీఎఫ్ కింద రూ. 1 కోటి కార్పస్‌ను దాటడానికి 30 సంవత్సరాలు పడుతుంది. 55 సంవత్సరాల వయస్సులో వ్యక్తి రూ. 1.07 కోట్లను విత్‌డ్రా చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..