LIC: సాయుధ బలగాలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 2కోట్ల వరకూ గృహ రుణం..
దేశాన్ని కాపాడే రక్షణ రంగ సిబ్బందికి అంటే సైనికులకు ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి భారత భద్రతా దళాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు గృహ రక్షక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీమా సంస్థల్లో అత్యధిక ప్రాచుర్యం పొందిన సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ). అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ కూడా ఇదే. దీనిలో పాలసీ తీసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ప్రభుత్వ మద్దతు కూడా ఉండటం మేలు చేస్తుందని పాలసీదారులు భావిస్తారు. అందుకే ఎల్‌ఐసీ పాలసీలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. అందుకనుగుణంగానే ఎల్‌ఐసీ కూడా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పాలసీలను అందిస్తూ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వయసుల వారికీ పాలసీలుంటాయి. ఇదే క్రమంలో ఇప్పుడు దేశాన్ని కాపాడే రక్షణ రంగ సిబ్బందికి అంటే సైనికులకు ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి భారత భద్రతా దళాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు గృహ రక్షక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎల్‌ఐసీ గృహ రక్షక్..
భారత సైన్యంలో పనిచేసే సిబ్బందికి ఎల్‌ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా గృహ రుణ సదుపాయాన్ని అందిస్తోంది. గృహ రక్షక్ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో అర్హత కలిగిన వారికి కేవలం 8.4శాతం వడ్డీ రేటతో రూ. 2కోట్ల వరకూ గృహ రుణాలను అందించనున్నట్లు ప్రకటించింది. సైన్యంలో పనిచేస్తూ.. క్రెడిట్ స్కోర్ 750 అంతకన్నా ఎక్కువ ఉన్న వారు ఈ పథకానికి అర్హులను పేర్కొంది. వార్షిక వడ్డీ కేవలం 8.4శాతంగానే ఉంటుందని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వివరించింది.
మరిన్ని ప్రయోజనాలు..
గృహ రక్షక్‌తో కేవలం తక్కువ వడ్డీ మాత్రమే కాక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. లోన్ తీసుకునే వారికి పరిమిత కాల ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజులను సైతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. భద్రతా బలగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారే కాకుండా రిటైర్డ్ అయిన అధికారులు, సిబ్బంది సైతం ఈ ఆఫర్ పొందొచ్చని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది.
గర్వకారణం..
దేశ రక్షణ కోసం శ్రమించే సాయుధ బలగాల సిబ్బందికి ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందించడం తమకు గర్వకారణంగా ఉందని ఎల్‌ఐసీ హైసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో త్రిభువన్ చెప్పారు. దేశ భద్రత కోసం అహర్నిశలు నిస్వార్థంగా పనిచేసే సైన్యానికి కృతజ్ఞతలు తెలిపే మార్గంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే పథకం పరిమిత కాలం వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ ప్రకటించింది. ఒక నెలా 14రోజుల వరకూ అంటే సెప్టెంబర్ 30, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, సైనికులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..