BSA Gold Star 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ పోటీగా మహీంద్రా.. కొత్త ‘గోల్డ్ స్టార్’ లుక్ చూస్తే మతి పోవాల్సిందే..

మహీంద్రా గ్రూప్ యాజమాన్యంలోని దిగ్గజ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏ తన గోల్డ్ స్టార్ 650 ను ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఈ మోటారు సైకిల్ ను విడుదల చేశారు. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి దీనికి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

BSA Gold Star 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ పోటీగా మహీంద్రా.. కొత్త ‘గోల్డ్ స్టార్’ లుక్ చూస్తే మతి పోవాల్సిందే..
Bsa Gold Star 650 Motorcycle
Follow us
Madhu

|

Updated on: Aug 20, 2024 | 12:34 PM

దేశంలోని రోడ్లపై పరుగులు పెట్డడానికి మరో దిగ్గజ కంపెనీ నుంచి కొత్త మోటార్ సైకిల్ విడుదలైంది. విస్తరిస్తున్న ద్విచక్ర వాహనాల మార్కెట్ లోకి కొత్త వాహనం వచ్చి చేరింది. మహీంద్రా గ్రూప్ యాజమాన్యంలోని దిగ్గజ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏ తన గోల్డ్ స్టార్ 650 ను ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఈ మోటారు సైకిల్ ను విడుదల చేశారు. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి దీనికి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా స్టైలిష్ లుక్ తో డిజైన్ చేశారు. ఈ మోటారు సైకిల్ ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

గోల్ స్టార్ ధర రూ.2.99 లక్షలు

మనదేశంలో మహీంద్రా గ్రూప్‌నకు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. వాహన రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈ సంస్థ ముందుకు దూసుకుపోతోంది. మన దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు చాలా ఎక్కువ. వీరు తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యలో కొత్తగా విడుదలైన బీఎస్ ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ పై అనేక అంచనాలు నెలకొన్నాయి. 652 సీసీ ఇంజిన్ కెపాసిటీలో వచ్చిన గోల్డ్ స్టార్ 650 ధర 2.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నిర్ణయించారు.

బీఎస్ఏ ప్రస్థానం..

బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) కంపెనీ ప్రపంచంలోని పురాతన మోటార్‌సైకిళ్ల తయారీదారులలో ఒకటి. ఈ సంస్థ నుంచి గతంలో అనేక మోడళ్ల వాహనాలు విడుదలయ్యాయి. వాటికి ప్రజల ఆదరణ కూాడా లభించింది. మహీంద్రా గ్రూపునకు చెందిన మోటార్ సైకిల్ విభాగమైన క్లాసిక్ లెజెండ్స్ ద్వారా 2016లో బీఎస్ఏ ను కొనుగోలు చేశారు. మన దేశంలో జావా, యెజ్డీ మోటార్‌సైకిళ్లను విక్రయించడం ద్వారా క్లాసిక్ లెజెండ్స్ ఎంతో ప్రసిద్ధి చెందింది. యూకేలో 2021లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650ను ప్రారంభించారు. ప్రస్తుతం యూరప్, టర్కీ, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనదేశంలో కూడా అడుగు పెట్టింది. గోల్డ్ స్టార్ మోటారు సైకిల్ విడుదల సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ బీఎస్ఏను మన దేశానికి తీసుకురావడం అనేది చాలా సంతోషకర విషయమన్నారు. దీని ద్వారా ప్రపంచ మోటార్‌సైక్లింగ్ చరిత్రలో దేశానికి గుర్తింపు లభించిందన్నారు.

ఆకట్టుకునే లుక్..

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ రెట్రో లుక్ తో ఆకట్టుకుంటోంది. దీనిలో 652 సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఈ మోటారు సైకిల్ 6500 ఆర్పీ వద్ద 45 హెచ్ పీ పవర్, 4000 ఆర్పీ వద్ద 55 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇంజిన్ కు 5 స్పీడ్ గేర్ బాక్స్ కనెక్ట్ చేశారు. మిగిలిన ప్రత్యేకతల విషయానికి వస్తే.. వైర్ స్పోక్ వీల్స్, రెండు వైపులా సింగిల్ డిస్క్, ఏబీఎస్, బ్రెంబో కాలిపర్స్, ఇంజిన్ ఇమ్ముబిలైజర్, హ్యాండిల్ భార్ మౌటెటె్ యూఎస్ బీ పోర్ల తదితర ఫీచర్లు ఉన్నాయి.

మార్కెట్ నిపుణుల అంచనా..

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ విడుదలైన న నేపథ్యంలో మార్కెట్ నిపుణులు అనేక అంచనాలు వేస్తున్నారు. ఈ మోటారు సైకిల్ కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650, రాయల్ ఎన్ ఫీల్డ్ మిటియర్ 650కి గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..