Lamborghini Temerario: 2.7 సెకండ్లలో 100కిలోమీటర్ల స్పీడ్.. లంబోర్ఘిని కొత్త హైబ్రీడ్ కారు మామూలుగా లేదుగా..

లంబోర్ఘిని నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆ కంపెనీ అందుకు పూర్తిగా సన్నద్ధమవ్వలేదు. ఈవీకి బదులుగా కొత్త హైబ్రిడ్ కారు టెమెరారియోను మార్కెట్ కు పరిచయం చేసింది. మాంటెరీ కార్ వీక్ ఈవెంట్ లో కొత్త కారును ప్రదర్శించింది. దాదాపు నాలుగున్నరేళ్ల క్రితమే ఈ కారు ను అభివృద్ధి చేయడాన్ని కంపెనీ ప్రారంభించింది.

Lamborghini Temerario: 2.7 సెకండ్లలో 100కిలోమీటర్ల స్పీడ్.. లంబోర్ఘిని కొత్త హైబ్రీడ్ కారు మామూలుగా లేదుగా..
Lamborghini Temerario
Follow us
Madhu

|

Updated on: Aug 20, 2024 | 3:16 PM

ప్రపంచంలో కార్ల మార్కెట్ విపరీతంగా విస్తరిస్తోంది. సామాన్యుల నుంచి ధనికుల వరకూ వారి అవసరాలకు అనుగుణంగా అనేక వివిధ కంపెనీల కార్లు విడుదలవుతున్నాయి. సరికొత్త ఫీచర్లు, ప్రత్యేకతలు, స్లైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. దాదాపు రోజుకో సరికొత్త కారు మార్కెట్ లోకి విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ అయిన లంబోర్ఘిని నుంచి సరికొత్త సూపర్ స్టైలిష్ కారు విడుదలైంది. లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలను తయారు చేయడంతో ఈ కంపెనీకి ఎంతో పేరుంది. లంబోర్ఘిని నుంచి విడుదలైన టెమెరారియో స్పోర్ట్స్ కారు ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

హురాకాన్ తర్వాత

లంబోర్ఘిని నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆ కంపెనీ అందుకు పూర్తిగా సన్నద్ధమవ్వలేదు. ఈవీకి బదులుగా కొత్త హైబ్రిడ్ కారు టెమెరారియోను మార్కెట్ కు పరిచయం చేసింది. మాంటెరీ కార్ వీక్ ఈవెంట్ లో కొత్త కారును ప్రదర్శించింది. దాదాపు నాలుగున్నరేళ్ల క్రితమే ఈ కారు ను అభివృద్ధి చేయడాన్ని కంపెనీ ప్రారంభించింది. తన అవుట్ గోయింగ్ వీ10 సూపర్ స్పోర్ట్స్ కారైన హురాకాన్ స్థానంలో టెమెరారియోను తీసుకువచ్చింది.

వీ10 ఇంజిన్ కు స్వస్తి..

టెమెరారియో కారులో సంప్రదాయ వీ10 ఇంజిన్ కు బదులు ట్విన్ టర్బో చార్జ్ 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇది 10.000 ఆర్పీఎమ్ కు చేరుకుంటుందని, అత్యధిక రివీవింగ్ ఇంజిన్ అని కంపెనీ తెలిపింది. ఈ వీ8 మాత్రమే 9000 ఆర్ఫీఎం 9,750 ఆర్ఫీఎం మధ్య 800 హెచ్ పీని ఉత్పత్తి చేస్తుందని వెల్లడించింది.

ఎలక్ట్రిక్ మోటార్లు..

వీ8 ఇంజిన్ కు అనుబంధంగా మూడు ఎలక్ట్రిక్ మోటారు అమర్చారు. వీటి నుంచి మరో 295 బీహెచ్పీ విడుదల అవుతుంది. ఈ హైబ్రిడ్ సెటప్ పెట్రోల్ ఇంజిన్ తో కలిపి 920 హెచ్ పీ, 800 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడమే హైబ్రిడ్ పవర్ ట్రైయిన్ ప్రధాన ఉద్ధేశం. కారు ప్రత్యేకతల విషయానికి వస్తే టెమెరారియో కారు కేవలం 2.7 సెకండ్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గరిష్టంగా 340 కేఎంపీఎల్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది.

ఏరో డైనమిక్ సామర్థ్యం..

టెమెరారియోతో ఏరోడైనమిక్ సామర్థ్యం పరంగా లంబోర్ఘిని మెరుగుదల సాధించింది. అత్యాధునికమైన హైస్ట్రెంగ్త్, అల్ట్రా- లైట్ అల్లాయ్‌ని ఉపయోగించడం వల్ల టోర్షనల్ దృఢత్వాన్ని గణనీయంగా పెరుగుతుంది. సులభమైన డ్రైవింగ్ కు దోహదపడుతుంది. ముఖ్యంగా టెమెరారియో అనేది ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. ప్రయాణికులు, లగేజీకి కోసం ఇతర వాహనాల కంటే ఎక్కువ స్థలం ఉంది.

సూపర్ ఇంటీరియర్..

టెమెరారియో కారుకు సంబంధించి ఇంటీరియర్ పై ప్రత్యేక శ్రద్ధ చూపారు. కొత్త ఛాసిస్ వల్ల అదనంగా 34 మిమీ హెడ్ రూమ్ లభిస్తుంది. స్టాండర్డ్ ఫిట్ కంఫర్ట్ సీట్లు వేడి, వెంటిలేషన్, 18వే ఎలక్ట్రిక్ సర్దుబాటును అందిస్తాయి. వీటిలో పాటు అన్ బోర్డ్ టెలిమెట్రీ, డాష్ క్యామ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ నామిగేషన్ తదితర ప్రత్యేకతలున్నాయి. అయితే ఈ కారు 2025 ద్వితీయార్థంలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. హురాకాన్ కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..