EPFO Alert: పీఎఫ్ డేటా కరెక్షన్ మరింత ఈజీ.. ఆ ప్రూఫ్స్ మాత్రం మస్ట్

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. భారతదేశంలో ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడానికి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు కంపెనీ కూడా నెలనెలా సమాన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పీఎఫ్ డేటా ఎంట్రీ సమయంలో జరిగిన తప్పులు విత్‌డ్రాతో పాటు మరికొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.

EPFO Alert: పీఎఫ్ డేటా కరెక్షన్ మరింత ఈజీ.. ఆ ప్రూఫ్స్ మాత్రం మస్ట్
Epfo
Follow us

|

Updated on: Aug 20, 2024 | 4:45 PM

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. భారతదేశంలో ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడానికి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు కంపెనీ కూడా నెలనెలా సమాన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పీఎఫ్ డేటా ఎంట్రీ సమయంలో జరిగిన తప్పులు విత్‌డ్రాతో పాటు మరికొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పీఎఫ్ డేటా స్పెల్లింగ్ మిస్టేక్స్ మార్చుకోవడం చాలా కష్టమని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే కొంతకాలం నుంచి పెరిగిన టెక్నాలజీ కారణంగా ఈపీఎఫ్ డేటా కరెక్షన్ కూడా సులభంగా మారింది. ఆన్‌లైన్‌లోనే ఈ డేటాను సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ డేటాను సరి చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు అవసరమో? ఓ సారి తెలుసుకుందాం.

పేరులో మూడు కంటే ఎక్కువ అక్షరాలను మార్చాల్సి ఉంటే దాన్ని మేజర్ మిస్టేక్‌గా పరిగణిస్తారు. మొదటి సారి పేరు మొత్తం మార్చాలన్నా మేజర్ మిస్టేక్‌ కింద పేర్కొంటారు. అలాగే పూర్తి పేరు కావాల్సి వచ్చినా మేజర్ మిస్టేక్ కింద పేర్కొంటారు. 3 కంటే తక్కువ అక్షరాలను మార్చాల్సి ఉంటే మైనర్ మిస్టేక్స్‌గా పేర్కొంటున్నారు. శ్రీ, డాక్టర్, శ్రీ, శ్రీమతి, మిస్ మొదలైన గౌరవార్థాలన తొలగించాల్సి ఉన్నా వాటిని కూడా మైనర్ మిస్టేక్స్‌ అంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే మేజర్ మిస్టేక్స్ కరెక్ట్ చేయడానికి మూడు ప్రూఫ్‌లు కావాల్సి ఉంటుంది. అయితే మైనర్ మిస్టేక్స్ సరి చేయడానికి ఏవైనా రెండు ప్రూఫ్స్ అందిస్తే సరిపోతుంది. 

ఇవి కూడా చదవండి

అవసరమైన పత్రాలు ఇవే

  • పాస్‌పోర్ట్
  • సభ్యుని రేషన్ కార్డ్/పీడీఏ కార్డ్
  • కేంద్రం/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూ జారీ చేసిన సభ్యుల ఫోటోతో కూడిన మెడి-క్లెయిమ్ కార్డ్
  • పెన్షన్ కార్డు
  • రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర నోటిఫైడ్ స్థానిక సంస్థలు, తాలూక్, తహసీల్దార్ మొదలైన ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన సభ్యుని జనన ధ్రువీకరణ పత్రం.
  • ప్రభుత్వం జారీ చేసిన సభ్యుల వివాహ ధ్రువీకరణ పత్రం
  • తండ్రి పేరు/ తల్లి పేరు/ జీవిత భాగస్వామి పేరు ఉన్న సభ్యుని ఆధార్ కార్డ్.
  • పాన్ కార్డ్
  • ఎస్ఎస్‌సీ మార్కుల లిస్ట్ 
  • డ్రైవింగ్ లైసెన్స్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎఫ్ డేటా కరెక్షన్ మరింత ఈజీ.. ఆ ప్రూఫ్స్ మాత్రం మస్ట్
పీఎఫ్ డేటా కరెక్షన్ మరింత ఈజీ.. ఆ ప్రూఫ్స్ మాత్రం మస్ట్
వామ్మో.. ఈ కూరగాయాలు తింటే యూరిక్ లెవల్స్ పెరగడం ఖాయం..
వామ్మో.. ఈ కూరగాయాలు తింటే యూరిక్ లెవల్స్ పెరగడం ఖాయం..
వధువును ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇలా అయ్యిందేంటి.. ఫన్నీ వీడియో
వధువును ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇలా అయ్యిందేంటి.. ఫన్నీ వీడియో
ఉమమహేశ్వర క్షేత్రంలో పరవళ్లు తొక్కుతున్న జలపాతం.. అందాలు చూడతరమా
ఉమమహేశ్వర క్షేత్రంలో పరవళ్లు తొక్కుతున్న జలపాతం.. అందాలు చూడతరమా
క్రెడిట్ కార్డు పేరుతో వ్యక్తి టోకరా..మూడు లక్షలు దోచేసిన వైనం
క్రెడిట్ కార్డు పేరుతో వ్యక్తి టోకరా..మూడు లక్షలు దోచేసిన వైనం
లైకుల కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతారా.. వైరల్ అవుతున్న వీడియో..
లైకుల కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతారా.. వైరల్ అవుతున్న వీడియో..
మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్..
మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్..
ఈ డ్రింక్స్‌తో ఫ్యాటీ లివర్ సమస్యకు బైబై చెప్పొచ్చు..
ఈ డ్రింక్స్‌తో ఫ్యాటీ లివర్ సమస్యకు బైబై చెప్పొచ్చు..
తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి..
తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి..
అత్యవసర సమయాల్లో ఆర్థిక భరోసా.. పర్సనల్ లోన్స్‌పై బంపర్ ఆఫర్లు
అత్యవసర సమయాల్లో ఆర్థిక భరోసా.. పర్సనల్ లోన్స్‌పై బంపర్ ఆఫర్లు