SBI ఆఫర్ చేస్తున్న ఈ డిపాజిట్ స్కీంలో రూ.5 లక్షలు ఫిక్స్‌డ్ చేస్తే రూ. 2 లక్షల వడ్డీ లభించే అవకాశం..
ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచినప్పటి నుంచి బ్యాంకులు తమ ఖాతాదారులకు డిపాజిట్లపై కూడా ఎక్కువ వడ్డీని చెల్లించడం ప్రారంభించాయి.

ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచినప్పటి నుంచి బ్యాంకులు తమ ఖాతాదారులకు డిపాజిట్లపై కూడా ఎక్కువ వడ్డీని చెల్లించడం ప్రారంభించాయి. ఇటీవలి కాలంలో, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వివిధ కాలాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI కూడా FDలపై డిపాజిట్ రేట్లను పెంచింది. ఇందులో సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ‘SBI Wecare డిపాజిట్ పథకం’ కింద సీనియర్ సిటిజన్‌లకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పథకం గడువు 31 మార్చి 2023 వరకు పొడిగించగా, ఇంకా 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
రూ. 5 లక్షల డిపాజిట్‌పై రూ. 2 లక్షల వడ్డీ:
SBI వీకేర్ డిపాజిట్, SBI సీనియర్ సిటిజన్ల కోసం ఒక ప్రత్యేక పథకం, ఇందులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన సొమ్ముపై 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే, అతను 5 సంవత్సరాల మెచ్యూరిటీపై రూ.7,16,130 పొందుతారు. అంటే వడ్డీ ఆదాయం రూ.2,16,130 వరకూ సంపాదించే అవకాశం ఉంది.




ఈ పథకంలో, 0.50 శాతం కాకుండా, 0.30 శాతం అంటే మొత్తం 0.80 శాతం ఎక్కువ వడ్డీని 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన FDలపై సీనియర్ సిటిజన్‌లందరికీ అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై డిసెంబర్ 13, 2022 నుండి వర్తిస్తాయి.
SBI FD: పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు:
బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు / టర్మ్ డిపాజిట్లు సాధారణంగా సురక్షితంగా పరిగణిస్తుంటారు. రిస్క్ లేని పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపిక. 5 సంవత్సరాల పన్ను ఆదా విషయానికి వస్తే, FDపై సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, FDపై వచ్చే వడ్డీపై మాత్రం పన్ను విధించబడుతుంది. దీనికి 5 సంవత్సరాల లాక్ ఇన్ ఉంది. ఈ వ్యవధి 10 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. SBI దాని ఉద్యోగులు పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న FD రేట్ల కంటే 1% ఎక్కువ వడ్డీని అందజేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి