AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్‌ కార్డులో ఏయే వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు.. యూఐడీఏఐ నిబంధనలు ఏమిటి?

మనకున్న డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యం. అయితే చాలా మంది ఆధార్‌ కార్డులోని వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటిని సరి చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు..

Aadhaar Card: ఆధార్‌ కార్డులో ఏయే వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు.. యూఐడీఏఐ నిబంధనలు ఏమిటి?
Aadhaar Updates
Subhash Goud
|

Updated on: Mar 11, 2023 | 7:07 AM

Share

మనకున్న డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యం. అయితే చాలా మంది ఆధార్‌ కార్డులోని వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటిని సరి చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ సెంటర్లలో తిరుగుతుంటారు. ఆధార్‌లో తప్పులు ఉండటం కారణంగా సమస్యలు వస్తుంటాయి. ఆధార్‌ కార్డు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్‌ నంబర్‌, లింగం మొదలైన వాటిని మార్పులు చేసుకునే వెలసులుబాటు కల్పించింది యూఐడీఏఐ. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కార్డులో ప్రతి సమాచారాన్ని పదేపదే మార్పు చేసుకునేందుకు కుదరదు.

అయితే బయోమెట్రిక్‌ వివరాలు కలిగి ఉన్నందున ఆధార్‌ కార్డు ఇతర పత్రాలకంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రతి అవసరానికి ఆధార్ కార్డు తప్పనిసరి అవసరమైన ఉన్నందున కార్డులోని వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల మీ కార్డులో కూడా ఏదైనా సమాచారం తప్పుగా నమోదు అయితే వెంటనే సరి చేసుకోండి. కార్డులోని వివరాలు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ముందుగా సరి చేసే వివరాలు మళ్లీ మళ్లీ తనిఖీ చేయండి. ఎక్కువ సార్లు మార్పులు చేస్తే కుదరదు.

ఆధార్‌లో పేరును 2 సార్లు మాత్రమే..

ఆధార్ కార్డులో, పేరులో తప్పులు దొర్లినట్లయితే సరి చేసుకునేందుకు కేవలం రెండు సార్లు మాత్రమే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. ఏదైనా పొరపాటు ఉంటే లేదా వివాహం తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటే వారు అలా చేయవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో పేరు మార్చుకునే అవకాశం ఉంది. మీరు ఆధార్ కార్డ్‌లో పేరు అప్‌డేట్‌ చేసుకోవాలంటే రెండుసార్లు మాత్రమే చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

లింగం 1 సారి:

ఇక ఆధార్‌ తయారు చేస్తున్న క్రమంలో ఒక్కోసారి లింగం తప్పుగా పడుతుంది. దానిని సరి చేసుకునేందుకు యూఐడీఏఐ నిబంధనల ప్రకారమే మార్చుకునేందుకు వీలుటుంది. ఆధార్ కార్డ్‌లో లింగాన్ని అప్‌డేట్ చేయడానికి మీకు ఒకే ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.

పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?

అలాగే ఆధార్‌లోని పుట్టిన తేదీ కూడా చాలా మందికి తప్పుగా పడుతుంది. పుట్టినత ఏదీ సరిగ్గా లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాంటి సమయంలో పుట్టిన తేదీని సరి చేసుకునేందుకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.

ఈ సమాచారాన్ని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు..

ఆధార్‌లోని కొన్ని వివరాలు ఎన్ని సార్లు అయినా మార్చుకునేందుకు వీలుంది. కార్డులోని ఇంటి చిరునామా, ఇమెయిల్‌ ఐడి, ఫోన్‌ నంబర్‌, ఫోటో, వేలిముద్రలు, ఐ స్కాన్‌ వంటివి ఎన్ని సార్లు అయినా అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటికి ఎలాంటి పరిమితి విధించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?