Aadhaar Card: ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి మోడీ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త..!

ప్రస్తుతం మనకుండే డాక్యుమెంట్లలో కీలకమైనది ఆధార్‌ కార్డు. ఇది లేనిది ఏ పని జరగదు. అలాగే ప్రతి ఒక్కరికి ఆధార్‌తో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడి కార్డు, రేషన్‌ కార్డు..

Aadhaar Card: ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి మోడీ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త..!
Aadhaar Card
Follow us
Subhash Goud

|

Updated on: Mar 08, 2023 | 5:11 PM

ప్రస్తుతం మనకుండే డాక్యుమెంట్లలో కీలకమైనది ఆధార్‌ కార్డు. ఇది లేనిది ఏ పని జరగదు. అలాగే ప్రతి ఒక్కరికి ఆధార్‌తో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడి కార్డు, రేషన్‌ కార్డు వంటి కార్డులు కూడా ముఖ్యమైనవే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌ అందించబోతోంది. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కేంద్రం అదిరిపోయే సరికొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త సేవ ద్వారా ప్రజలకు ఎంతో ఊరట కలుగనుంది. చాలా మందికి ఆధార్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌, ఓటర్‌ ఐడికార్డు, రేషన్‌ కార్డు వంటివి ఉంటాయి. ఇవి కీలకమైన డాక్యుమెంట్లు. చాలా మందికి ఆధార్‌లో ఒక అడ్రస్‌ ఉంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, ఓటర్ ఐడి కార్డులలో మరో అడ్రస్‌ ఉంటుంది.

ఈ డాక్యుమెంట్లలో వేర్వేరు వివరాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో అన్ని డాక్యుమెంట్లలో వివరాలు సరి చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాటన్నింటికి వేర్వేరు కార్యాలయాలు, మీ సేవకు కేంద్రాలకు వెళ్లి సరి చేసుకోవాల్సి పరిస్థితి ఉంటుంది. కొన్నింటి డాక్యుమెంట్లలకు వివరాలు సరి చేసుకోవాలంటే అసలు ఆప్షనే లేదు. ఇలా పత్రాలన్నింటిలో వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కష్టమైన పనే. ఎందుకంటే వివరాలను మార్చుకోవడానికి ఒక్కో డాక్యుమెంట్ కోసం ఒక్కో చోటుకు వెళ్లాల్సి ఉంటుంది.

అందుకే ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రానున్న రోజుల్లో డాక్యుమెంట్లలో ఏవైనా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలంటే మరింత సులభతరం కానుంది. కేంద్రం తీసుకువచ్చే కొత్త సర్వీసులతో ఈ పని సులభం కానుంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో కేంద్రం కొత్ల ప్లాట్‌ఫామ్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కొత్త సిస్టిమ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా ఆధార్‌లోని ఏవైనా మార్పులు ఉంటే ఆ మార్పులన్ని కూడా ఆటోమేటిక్‌గా ఇతర డాక్యుమెంట్లలో కూడా అప్‌డేట్‌ అవుతాయి. మీరు మీ ఆధార్‌ కార్డులో ఏవైనా వివరాలు అప్‌డేట్‌ చేస్తే ఆ వివరాలు ఓటర్‌ ఐడి, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల్లో కూడా అప్‌డేట్‌ అవుతాయి. అది జరిగితే కనుక అన్ని డాక్యుమెంట్లలో ఒకే విధమైన వివరాలు ఉంటాయి.

మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఈ కొత్త సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌ కోసం ట్రాన్స్‌పోర్ట్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీ రాజ్‌, ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి వాటిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఐటీ శాఖ డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, ఓటర్ ఐడి కార్డు వంటి కీలకమైన పత్రాలను జారీ చేసే డిపార్ట్‌మెంట్లతో చర్చించనుంది. తర్వాత పాస్‌పోర్టు వంటి ఇతర డాక్యుమెంట్లకు ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఏదీ ఏమైనా ఈ సర్వీసు కనుక అందుబాటులోకి వస్తే దేశ ప్రజలకు శుభవార్తేనని చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!