Portable AC: పోర్టబుల్ మినీ ఏసీ.. అదిరిపోయే లుక్, అద్భుతమైన ఫీచర్లు.. కేవలం రూ. 449కే!
ఎండాకాలం వచ్చేసింది. భగభగమంటున్న సూర్యుడి తాపాన్ని జనాలు తట్టుకోలేకపోతున్నారు. మరి మీరు కూడా..
ఎండాకాలం వచ్చేసింది. భగభగమంటున్న సూర్యుడి తాపాన్ని జనాలు తట్టుకోలేకపోతున్నారు. మరి మీరు కూడా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఓ ఏసీ తీసుకోవాలనుకుంటే.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఏసీలపైన భారీ ఆఫర్లు అందుబాటులోనే ఉన్నాయి. సాధారణంగా గోడకు అమర్చబడే ఏసీ తీసుకుంటే.. కేవలం ఒక్క రూమ్‌కు మాత్రమే చల్లదనం వస్తుంది. అదే పోర్టబుల్ ఏసీలతో అయితే.. మీరు ఇల్లంతటిని కూల్ చేసేయొచ్చు. పోర్టబుల్ ఎయిర్ కూలర్‌లను ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. వాటిని మీ పర్సనల్ ఏసీల్లా కూడా ఉపయోగించవచ్చు. మరి ఇప్పుడు ఆ కోవకు చెందిన ఓ మినీ ఏసీ గురించి మాట్లాడుకుందాం.. దాని ధర, ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా.?
ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఈ మినీ ఎయిర్ కూలర్ అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని వెనుక 700 మిల్లీలీటర్ల నీరు నింపుకునేందుకు ట్యాంక్ అమర్చబడి ఉంది. మీరు ఈ ఏసీని ఏ రూమ్‌లోనైనా వాడుకునేందుకు వీలుగా దీన్ని వేలాడ దీసుకునేందుకు వెనుక భాగంలో స్ట్రాప్ కూడా ఇచ్చారు. ఈ పోర్టబుల్ ఏసీలోని వాటర్ కర్టన్ ఫిల్టర్ స్క్రీన్.. బయటకు స్వచ్చమైన గాలి వచ్చేలా చేస్తుంది. ఇందులో 7 రంగుల ఎల్‌ఈడీ కలర్ ఆప్షన్ ఉంది. అలాగే మీరు కూలింగ్ ఫ్యాన్ స్పీడ్‌ను మూడు మోడ్స్‌లో అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అటు ఈ ఏసీ బరువు 1 కేజీ ఉండటంతో పాటు దీనిలో నుంచి 40 డెసిబుల్స్ కంటే లో-సౌండ్ వస్తుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో లభించే ఈ మినీ ఎయిర్ కూలర్ ధర కేవలం రూ. 449కే అందుబాటులో ఉంది. కాగా, ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆ సైట్, వస్తువుకు సంబంధించిన కండీషన్‌ను సరిగ్గా చూసి తీసుకోండి. పైన ఇచ్చినది కేవలం సమాచారం కోసమే.. ఇది గమనించగలరు.