Train Ticket Booking: మీ రైలు టికెట్లు త్వరగా బుక్ కావాలంటే మాస్టర్ జాబితాను సిద్ధం చేయండి.. దీనిని ఉపయోగంచడం ఎలా?
రైల్వే సామాన్య ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. పండుగల సమయంలో రైళ్లలో..
రైల్వే సామాన్య ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. పండుగల సమయంలో రైళ్లలో రద్దీ చాలా రెట్లు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఇంటికి వెళ్లి రావడానికి త్వరగా కన్ఫర్మ్ టికెట్ పొందడం లేదు. ఇలాంటి సమయంలో తత్కాల్ టిక్కెట్లను ఆశ్రయిస్తారు. కానీ రద్దీ కారణంగా, అది కూడా అందుబాటులో ఉండవు. మీరు సులభమైన పద్దతులను అనుసరించడం ద్వారా టికెట్లు త్వరగా బుక్ అవుతాయి. ఈ ట్రిక్ IRCTC మాస్టర్ లిస్ట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
టికెట్లు సులభంంగా బుకింగ్ కావాలంటే మాస్టర్ జాబితాను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మీ సమయం వృధా కాకుండా టికెట్లు త్వరగా బుక్ అవుతాయి. దీని వల్ల మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు.
మాస్టర్ జాబితా అంటే ఏమిటి?
ఐఆర్‌సీటీసీ ప్రయాణికులను మాస్టర్ జాబితాను రూపొందించడానికి అనుమతిస్తుంది. ఈ మాస్టర్ లిస్ట్ ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ప్రయాణికుల పేరు, వయస్సు, ఇతర వివరాలను తీసుకునే ముందు మీరు మాస్టర్ జాబితాను సిద్ధం చేయాలి. ఎందుకంటే మీరు ఐఆర్‌సీటీసీ నుంచి టికెట్లను బుక్ చేయాలంటే ప్రయాణికులందరి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం సరిపోక టికెట్స్ బుక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ మాస్టర్ జాబితాను సిద్ధం చేయడం వల్ల బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణికుల వివరాలను పూరించడానికి బదులుగా, మీరు ఈ మాస్టర్ జాబితా నుంచి ఆటోమేటిక్‌గా వివరాలను వెబ్‌సైట్ తీసుకుంటుంది. దీని వల్ల మీ సమయం వృధా కాకుండా త్వరగా టికెట్స్ బుక్ అవుతాయి. ఈ మాస్టర్ జాబితా అనేది మీ కుటుంబ సభ్యుల వివరాలు ముందుగానే నమోదు చేసుకోవడం. ఐఆర్‌సీటీసీ ప్రొఫైల్ విభాగానికి వెళ్లడం ద్వారా ఈ జాబితా తయారు చేసుకోవచ్చు. మాస్టర్ జాబితాను ఎలా సిద్ధం చేయాలో, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఈ విధంగా మాస్టర్ జాబితాను సిద్ధం చేయండి:
- దీని కోసం ముందుగా IRCTC యాప్‌ను ఓపెన్ చేయండి.
- ఆపై మై అకౌంట్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మై మాస్టర్ జాబితాకు వెళ్లండి.
- దీని తర్వాత యాడ్ ప్యాసింజర్స్ పై క్లిక్ చేయండి.
- దీని తర్వాత, పేరు, వయస్సు వంటి ప్రయాణికులందరి వివరాలను నమోదు చేయండి.
- ఆ తర్వాత సేవ్ చేయండి.
టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు మాస్టర్ జాబితాను ఎలా ఉపయోగించాలి:
- టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్లాన్ మై జర్నీపై క్లిక్ చేయండి.
- దీని తర్వాత స్టేషన్, తేదీని ఎంచుకోండి.
- ఆపై ప్రయాణికుల వివరాలకు వెళ్లండి.
- దీని తర్వాత, యాడ్ ప్యాసింజర్స్ ఆప్షన్‌కు వెళ్లి, మాస్టర్ జాబితా నుంచి ప్రయాణికుల వివరాలను నమోదు చేయండి.
- దీని తర్వాత చెల్లింపు చేయండి. అలాగే మీ టిక్కెట్ బుకింగ్ కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.
- మాస్టర్ జాబితా కారణంగా మీ టిక్కెట్ బుకింగ్ వ్యవధి తగ్గుతుంది. దీని కారణంగా మీరు తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో టిక్కెట్‌ను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి