- Telugu News Photo Gallery Business photos PM Kisan Yojana has 13th installment money not reach your bank account even if name is in beneficiary list, then do this
PM Kisan: రైతులకు బిగ్ అలెర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు జమ కాలేదా..? ఇలా చేస్తే వెంటనే..
పీఎం కిసాన్ యోజన 13వ విడత నగదు ఫిబ్రవరి 27న రైతుల ఖాతాల్లో జమ అయిన విషయం తెలిసిందే. మొత్తం 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు నగదు ట్రాన్స్‌ఫర్ అయింది. అయితే, లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నా..
Updated on: Mar 07, 2023 | 1:46 PM

పీఎం కిసాన్ యోజన 13వ విడత నగదు ఫిబ్రవరి 27న రైతుల ఖాతాల్లో జమ అయిన విషయం తెలిసిందే. మొత్తం 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు నగదు ట్రాన్స్‌ఫర్ అయింది. అయితే, లబ్ధిదారుల జాబితాలో ఉన్నా.. కొంతమందికి రూ.2000 జమకాలేదు. దీనికి పలు కారణాలున్నాయి. ఈ రైతుల జాబితాలో మీరు కూడా ఉంటే.. 13వ విడత నగదు పొందే అవకాశం ఉంది.

పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ సరైన సమాచారాన్ని పూరించలేకపోతే డబ్బు నిలిచిపోతుంది. మీరు నింపిన సమాచారం సరైనదా కాదా అని తెలుసుకోవడానికి, pmkisan.gov.in ని సందర్శించండి. ఈ సమాచారం తప్పు అయితే వెంటనే సరిదిద్దండి.

వ్యవసాయ మంత్రిత్వ శాఖను సంప్రదించండి. దీని గురించి వారికి తెలియజేయండి. రాబోయే వాయిదాతో పాటు ఈ మొత్తాన్ని మీ ఖాతాలో జమ చేసే అవకాశం ఉంటుంది. దీని కోసం కింద ఇచ్చిన ప్రక్రియను అనుసరించండి. ఆ తర్వాత మొత్తం బకాయి ఖాతాలోకి వస్తుంది.

కానీ ఏదైనా కారణం వల్ల పేరును ప్రభుత్వం తిరస్కరించినట్లయితే, అతను అర్హత పొందలేడు. అలాంటివారికి ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బు అందదు. అయితే, పైన తెలిపిన కారణాల వల్ల నగదు రాకపోతే ఇలా చేయండి. దీంతో నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇలా చేయండి.. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. కుడి వైపున ఫార్మర్ కార్నర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.

ఇక్కడ మీకు ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, గెట్ డేటాపై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియను అనుసరించిన తర్వాత, మీ సమాచారం ఇక్కడ క

మీ ఆధార్ నంబర్, ఖాతా నంబర్ తప్పుగా ఉంటే, దాన్ని సరిచేయవచ్చు. మీ ఖాతాలో రూ. 2000 జమకాకపోతే ఇక్కడ సంప్రదించండి

13వ వాయిదాకు సంబంధించిన డబ్బు మీ ఖాతాలో జమకాకపోతే.. మీరు pmkisan-ict@gov.in ఇమెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.

లేదా.. PM కిసాన్ యోజన- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ కూడా రైతుల ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.





























