- Telugu News Photo Gallery Bajaj Pulsar 150 CC Second Hand Bike Sale Under Rs 24000 On Droom Check Detail
Bike Sales: బంపర్ ఆఫర్.. కేవలం రూ. 24 వేలకే బజాజ్ పల్సర్.. మీరూ ఓ లుక్కేయండి!
మీకు బజాజ్ పల్సర్ బైక్ అంటే ఇష్టమా.? ఇప్పుడు ఆ వాహనం ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. అయితే బెస్ట్ డీల్స్‌లో..
Updated on: Mar 07, 2023 | 3:42 PM

మీకు బజాజ్ పల్సర్ బైక్ అంటే ఇష్టమా.? ఇప్పుడు ఆ వాహనం ఎక్స్-షోరూమ్ ధర దాదాపుగా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. అయితే బెస్ట్ డీల్స్‌లో భాగంగా తక్కువ బడ్జెట్‌లోనే మీరు ఆ బైక్ పొందొచ్చు. బజాజ్ పల్సర్ 150 సీసీ బైక్‌ను కేవలం 24 వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..?

సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ 'డ్రూమ్'.. బజాజ్ పల్సర్ 150 సీసీ 2010 మోడల్‌ను అమ్మకానికి ఉంచింది. ఈ వాహనం ఇప్పటివరకు 25 వేల 680 కి.మీ నడిచింది. డ్రూమ్‌లో అందించిన సమాచారం ప్రకారం, ఈ బైక్‌ని ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నారు.

బజాజ్ పల్సర్ డ్రూమ్‌లో రూ. 24 వేలకు అమ్మకానికి ఉంచారు. 'DL 5S' నెంబర్ ప్లేట్‌తో నోయిడా లొకేషన్‌లో అందుబాటులో ఉంది.

ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. 149CCతో ఈ కమ్యూటర్ బైక్‌ని పొందుతారు. పెట్రోల్ వేరియంట్‌తో ఈ బైక్ లీటర్‌కు 65 కిలోమీటర్లు ఇస్తుంది.

కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.




