PPF Scheme: ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. ఎటువంటి టాక్స్ కట్టకుండా లక్షాధికారులు కావచ్చు

జీవితంలో సంపాదించడం.. భవిష్యత్ కోసం కొంత దాచుకోవడం తప్పనిసరి అవసరాలు.. ప్రతి వ్యక్తీ తన వయసు సహకరించినంత వరకూ సంపాదించడం కోసం కష్టపడుతూనే ఉండాలి..

PPF Scheme: ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. ఎటువంటి టాక్స్ కట్టకుండా లక్షాధికారులు కావచ్చు
Ppf Scheme
Follow us

|

Updated on: Mar 06, 2023 | 5:07 PM

జీవితంలో సంపాదించడం.. భవిష్యత్ కోసం కొంత దాచుకోవడం తప్పనిసరి అవసరాలు.. ప్రతి వ్యక్తీ తన వయసు సహకరించినంత వరకూ సంపాదించడం కోసం కష్టపడుతూనే ఉండాలి. వయోభారం మొదలయ్యాకా.. కష్టపడే ఓపిక తగ్గిపోయాకా.. ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ.. అలా ఆధారపడటం అవతలి వారికి ఆర్ధిక పరంగా భారంగా మారడం సహజం. అందుకే కష్టపడే సమయంలో సంపాదించుకున్న దానిలో కాస్తో కూస్తో జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే.. పనిచేయలేని పరిస్థితి వచ్చినపుడు ఎవరికీ ఆర్ధిక భారం లేకుండా మన డబ్బుతో మనం కాలక్షేపం చేసేసే అవకాశం ఉంటుంది. ఇది పొదుపు ఎందుకు చేయాలి అని ఎవరైనా అడిగితే కచ్చితంగా చెప్పాల్సిన సమాధానం. ఇక దీనికి రెండో కోణం కూడా ఒకటి ఉంది. అది కష్టపడి సంపాదించిన సొమ్ములో చాలా భాగం పన్నులు కట్టడానికి ఎగిరిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఇటువంటి సందర్భంలోనే ప్రభుత్వం కల్పించిన పన్నురాయితీల కోసం కొంత సొమ్ము పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం చేయాలి. దీంతో టాక్స్ భారాన్ని తగ్గించుకోవచ్చు. అటు భవిష్యత్ అవసరాల కోసం మన సొమ్మును జాగ్రత్త చేసుకోవచ్చు. ముఖ్యంగా టాక్స్ భారం పడకుండా మనం పొదుపు చేసుకున్న సొమ్ము నుంచి చక్కని రాబడి పొందటానికి అంతేకాకుండా.. మన సొమ్ముకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడానికి ఉన్న ఒక పథకం గురించి చెప్పుకుందాం. అదే పీపీఎఫ్. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. మరి దీని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఎక్కువ సమయం లేదు. అటువంటి పరిస్థితిలో ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి మీరు మార్చి 31 లోపు కొన్ని పథకాలలో పెట్టుబడి పెట్టాలి. అటువంటి పరిస్థితిలో ఆదా పన్నుతో పాటు మీ పెట్టుబడిపై ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే, మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకానికి 7.1% వార్షిక వడ్డీ లభిస్తుంది.

పీపీఎఫ్‌పై పన్ను మినహాయింపు:

ఈ PPFపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇది EEE వర్గం కిందకు వస్తుంది. అంటే, మీరు పథకంలో చేసిన మొత్తం పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. ఇందులో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సమయంలో ఈ స్కీమ్‌లో పెట్టుబడి నుంచి పొందిన వడ్డీ, మెచ్యూరిటీపై పొందిన మొత్తంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

పీపీఎఫ్ ఖాతా తెరవడానికి కనీస మొత్తం రూ.500. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే గరిష్ట పెట్టుబడి పరిమితి వార్షికంగా రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు.

ఇక ఈ పథకం మెచ్యూరిటీ వివరాలు చూద్దాం.. పీపీఎఫ్‌ ఖాతా 15 సంవత్సరాలలో మెచ్యూరిటీ అయిన తర్వాత 5-5 సంవత్సరాల వరకు పొడిగింపు అందుబాటులో ఉంటుంది. అయితే మెచ్యూరిటీ అయిన ఒక సంవత్సరంలోపు వ్యవధిని 5-5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. దీని కోసం, మెచ్యూరిటీ పూర్తి కావడానికి ఒక సంవత్సరం ముందు ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే, మీరు ఈ పథకంలో మొత్తం 25 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 15, 20 లేదా 25 సంవత్సరాల తర్వాత మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

పీపీఎఫ్‌ నుంచి ఎప్పుడు విత్‌డ్రా చేయాలి..?

అయితే, పీపీఎఫ్‌ ఖాతాను తెరిచిన సంవత్సరం తర్వాత 5 సంవత్సరాల వరకు ఈ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయలేరు. ఈ వ్యవధి పూర్తయిన తర్వాత, ఫారం 2 నింపడం ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, మీరు 15 సంవత్సరాల కంటే ముందు డబ్బును విత్‌డ్రా చేస్తే, మీ ఫండ్ నుండి 1% టీడీఎస్ కింద కట్ చేస్తారు.

పీపీఎఫ్‌ అకౌంట్‌కు ఎవరెవరు అర్హులు?

ఇప్పుడు ఈ పీపీఎఫ్ ఎకౌంట్ ఎక్కడ తెరవ వచ్చు అనే అంశం పరిశీలిద్దాం. మీరు పీపీఎఫ్‌ ఖాతాను ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో మీ స్వంత పేరు మీద లేదా మైనర్ తరపున ఏ ఇతర వ్యక్తి అయినా తెరవవచ్చు. అయితే, నిబంధనల ప్రకారం, హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) పేరుతో పీపీఎఫ్‌ ఖాతా ఓపెన్ చేయడానికి వీలుకాదు.

మీరు ఈ పథకం ద్వారా ప్రతి నెలా వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే, మీరు 15 సంవత్సరాల తర్వాత 3 లక్షల 20 వేల రూపాయలు పొందుతారు. మరోవైపు నెలకు 2 వేల రూపాయలు పెట్టుబడి పెడితే 15 ఏళ్ల తర్వాత 6 లక్షల 40 వేల రూపాయలు వస్తాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఎంత లాభపడతారో ఈ చార్ట్ నుంచి తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..