Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు…ఈ బిజినెస్ చేస్తే రోజుకు కనీసం రూ.2000 సంపాదించే చాన్స్

ఈమధ్యకాలంలో చాలామంది వ్యాపారంవైపు అడుగులు వేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధంగా వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు.

Business Idea : టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు...ఈ బిజినెస్ చేస్తే రోజుకు కనీసం రూ.2000 సంపాదించే చాన్స్
Representative Image
Follow us
Madhavi

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2023 | 9:55 AM

ఈమధ్యకాలంలో చాలామంది వ్యాపారంవైపు అడుగులు వేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధంగా వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. ఉద్యోగాల కంటే వ్యాపారమే మిన్నా అనే కాన్సెప్టుతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కూడా ప్రభుత్వ బ్యాంకుల నుంచి నిరుద్యోగులకు ముద్రారుణాలను అందిస్తోంది. ముద్రా రుణాలను రూ. 10వేల నుంచి రూ. 1లక్ష వరకు పొందే ఛాన్స్ ఉంటుంది. బయట వ్యాపారుల నుంచి వడ్డీలకు తీసుకునే బదులు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణం పొందడం చాలా సురక్షితం, వడ్డీల బాధ అస్సలు ఉండదు.

అయితే మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? మీ గురించి ఓ సరికొత్త వ్యాపార ఆలోచనతో మీ ముందుకు వచ్చాం.అదేంటంటే..ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ మంచి లాభాలను ఇస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే రెండింతలు సంపాదించవచ్చు. అయితే వెంటనే మీరు పరాటా సెంటర్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఉత్తర భారతంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాల్లో ఈ పరాటాలను ఎక్కువగా తింటారు. కేవలం ఆ రాష్ట్రాల్లోనే కాదు మన తెలంగాణ, ఏపీలోనూ పరాటాలు తినే వారి సంఖ్య పెరిగుతోంది. ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర భారతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కాబట్టి పరాటా వ్యాపారం మంచి ఐడియా అని చెప్పొచ్చు.

ఇక మన తెలుగురాష్ట్రాల్లోని జనం కాస్త విభిన్నంగా ఉంటారు. కొత్త కొత్త రుచులను కొరుకుంటారు. అలాంటి వారి కోసం పరాటా వంటకం రుచి చూపించి వ్యాపారం ప్రారంభించవచ్చు. పరాటా అంటే గోధుమపిండితో రోటీ చేసి ఏదైనా వంటకం మధ్యలో ఆలు కానీ, పన్నీర్ కానీ, చికెన్ కానీ లేదా ఇతర వంటకం ఏదైనా సరే పెట్టి చపాతీల మలచి నిప్పులపై కాలుస్తుంటారు. వేడివేడి పరాటాలను తినేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

పరాటా సెంటర్ ఎలా ప్రారంభించాలి. తెలుసుకుందాం:

పరాటా సెంటర్ ప్రారంభించే ముందు మంచి స్థలాన్ని ఎంచుకోవాలి. నిత్య రద్దీగా ఉండే ప్రాంతం అయితే అక్కడు ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. పరాటా మెనూ తయారు చేసిన పరాటాలను విక్రయిస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మీకు పరాటా చేసే అనుభవం లేనట్లయితే…హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలలో అలాగే హోం సైన్స్ కోర్సులు అందిస్తున్న కాలేజీల్లో వీటి గురించి షార్ట్ టర్మ్ కోర్సులు ఉంటాయి. అక్కడ మీరు పరాటా మెలకువలను నేర్చుకుని సెంటర్ పెడితే మంచి అదాయం పొందవచ్చు.

క్వాలీటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావొద్దు. ఎందుకంటే పరాటా రుచి బాగుంటే అటోమెటిగ్గా కస్టమర్లు వస్తుంటారు. మీరు పరోటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 50వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్లేట్లు చపాతీలు కాల్చేందుకు ఒక పెద్ద స్టవ్ అవసరం ఉంటుంది. పరాటా తయారీ సెంటర్లో మీకు మంచి డిమాండ్ ఉంటే ఆదాయం వస్తున్నట్లయితే ఒక సహాయకుడిని పెట్టుకోవడం మంచిది. లేదంటే మీ కుటుంబ సభ్యులే కలిసి చేసుకుంటే ఇంకా లాభం ఉంటుంది. ఒక ఆలు పరాటా 25 నుంచి 35 రూపాయలు ఉంటుంది. రోజుకు 100 పరాటాలు అమ్మితే కనీసం మూడు వేల వస్తాయి. వెయ్యి రూపాయలు ఖర్చులకు పోతే..కనీసం రెండు వేలు మిగులుతాయి. ఈ లెక్కన చూస్తే కనీసం నెలకు రూ. 60వేల వరకు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..