‘హైడ్ అండ్ సీక్’ ఆడుతూ ఏకంగా దేశం దాటిపోయిన బాలుడు !!
బంగ్లాదేశ్‌కు చెందిన రతుల్ ఇస్లామ్ ఫహిమ్ అనే బాలుడు హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఏకంగా దేశాన్నే దాటిపోయాడు. అదెలా అనుకుంటున్నారా?
బంగ్లాదేశ్‌కు చెందిన రతుల్ ఇస్లామ్ ఫహిమ్ అనే బాలుడు హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఏకంగా దేశాన్నే దాటిపోయాడు. అదెలా అనుకుంటున్నారా? బంగ్లాదేశ్‌లోని ఓ పోర్ట్ ఏరియాలో నివసించే రతుల్ జనవరి 11న తన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో హైడ్ అండ్ సీక్ ఆడుతూ అక్కడికి దగ్గరలో ఉన్న ఓ కంటైనర్‌లో దాక్కున్నాడు. తన స్నేహితులు అతన్ని ఎంతకీ వెతికి పట్టుకోలేకపోయారు. ఆ కంటైనర్‌లో సరుకు లేకపోవడంతో దానిని తనిఖీ చేయకుండానే పోర్టు సిబ్బంది కంటైనర్‌కు తాళం వేసి ఓ పెద్ద క్రేన్‌తో ఓడలోకి ఎక్కించారు. ఆ ఓడ సముద్రంలో ప్రయాణిస్తూ జనవరి 17 నాటికి మలేషియా చేరింది. అక్కడ కంటైనర్‌లోనుంచి శబ్ధాలు రావడం గుర్తించిన ఓ ఉద్యోగి ఎవరో ఉన్నారని గ్రహించి తోటి సిబ్బందికి చెప్పాడు. దాంతో కంటైనర్ ఓపెన్ చేసి చూసిన వారాంత షాక్ తిన్నారు. లోపల రతుల్ ఫహిమ్‌ను చూసి ఆశ్చర్యపోయిన వారు పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక జిల్లా అధికారులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, మెరైన్ పోలీసులు అంతా ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారం రోజులుగా ఆహారం, నీరులేక నీరసించి ఉన్న ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుప్పు గుప్పుమంటూ సిగరెట్ తాగుతున్న కోతి.. ఈ వానరం స్టైల్ ఏ వేరు అంటున్న నెటిజన్స్
తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్ ఏసీలు.. చిన్న ప్లేస్‌లోనైనా చక్కగా ఇమిడిపోయే
లడఖ్‌లో కనువిందు చేసిన వింత జంతువు !! సింహం మొహం తో
5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్.. 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి
పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??