లడఖ్‌లో కనువిందు చేసిన వింత జంతువు !! సింహం మొహం తో
ప్రపంచంలో ఎన్నో జాతుల జంతువులు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి చాలా తక్కువ. అప్పడప్పుడూ మనకు తెలియని ఎన్నో రకాల జంతువులు అనుకోకుండా కనిపిస్తుంటాయి.
ప్రపంచంలో ఎన్నో జాతుల జంతువులు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి చాలా తక్కువ. అప్పడప్పుడూ మనకు తెలియని ఎన్నో రకాల జంతువులు అనుకోకుండా కనిపిస్తుంటాయి. తాజాగా లద్దాఖ్ లో ఓ వింత జంతువు కనిపించింది. అచ్చం సింహంలాంటి ముఖం కలిగి ఉన్న ఈ జంతువు నటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ జంతువుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘భారత్ లో ఓ అందమైన, అరుదైన జంతువు. లద్దాఖ్ రీజియన్ లో.. చాలా మంది దీని గురించి విని ఉండరు. ఊహించండి?’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీడియోలో జంతువును గమనిస్తే దాని ముఖం అచ్చం సింహం మాదిరిగా ఉంది. అయితే ప్రవీణ్ కశ్వాన ప్రశ్నకు స్పందించిన కొందరు యూజర్లు ఈ జంతువు హిమాలయన్ లింక్స్ అని, మరికొందరు యూరేషియన్ లింక్స్ అని కామెంట్ చేశారు. లింక్స్ అనే ఈ జంతువు పిల్లి జాతికి చెందినది. ఇది ఎక్కువగా యూరప్, ఆసియా, నార్త్ అమెరికా అడవుల్లో కనిపిస్తాయి. పక్షులు, ఇతర చిన్న పాటి జంతువులను వేటాడి తింటాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 6 వేలమందికి పైగా లైక్ చేశారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్.. 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి
పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??
విమర్శకులు తలదించుకునేలా.. తారక్ సమాధనం !!
Oscar: ఆస్కార్ అవార్డు అమ్మితే ఎంతొస్తుందో తెలుసా ??
Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

