Bajaj offer: డబ్బులు ఆదా చేయాలంటే ఈ బైక్ చాలా బెస్ట్.. అదిరే ఆఫర్ ప్రకటించిన బజాజ్

సాధారణంగా మోటారు సైకిళ్లన్నీపెట్రోలుతో నడుస్థాయి. ఏ కంపెనీ వాహనం తీసుకున్నా దానిలో పెట్రోలు పోయించాల్సిందే. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ల సందడి నెలకొంది. ఇంట్లోని విద్యుత్ తో వీటి బ్యాటరీలను చార్జింగ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. అయితే బజాజ్ ఆటో కంపెనీ ఫ్రీడమ్ 125 పేరుతో సీఎన్ జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)తో నడిచే మోటారు సైకిల్ ను విడుదల చేసింది

Bajaj offer: డబ్బులు ఆదా చేయాలంటే ఈ బైక్ చాలా బెస్ట్.. అదిరే ఆఫర్ ప్రకటించిన బజాజ్
Bajaj Cng Bike
Follow us
Srinu

|

Updated on: Dec 09, 2024 | 5:45 PM

పెట్రోలు వాహనాలతో పోల్చితే దీనికి నిర్వహణ ఖర్చులు 50 శాతం తగ్గుతాయని తెలిపింది. గత జూలైలో రూ.95 వేల (ఎక్స్ ఫోరూమ్)కు విడుదల చేసింది. ప్రస్తుతం మరో పదివేల తగ్గింపు అమలు చేస్తుంది. ప్రపంచంలో పెట్రోలు, ఎలక్ట్రిక్ కాకుండా సీఎన్ జీ తో నడిచే మొట్టమెదటి మోటారు సైకిల్ ఫ్రీడమ్ 125. దీంతో ఈ బైక్ విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. దేశ మార్కెట్ లోకి జూలైలో ఘనంగా విడుదలైంది. ఐదు నెలల్లోనే రూ.పది వేల తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. సీఎన్ జీతో పాటు పెట్రోలుతో కూడా ఈ బండి నడిచేలా ఏర్పాట్లు చేశారు. వాహన యజమాని తన అవసరాలన్ని బట్టి వినియోగించుకోవచ్చు.

దేశంలోని డీలర్లకు దాదాపు 80 వేల ఫ్రీడమ్ 125 సీఎన్ జీ మోటారు సైకిళ్లను కంపెనీ సరఫరా చేసింది. ఐదు నెలల్లో దాదాపు 35 వేల వాహనాల అమ్మకాలు జరిగాయి. అయితే ధర తగ్గింపు వెనుక గల కారణాన్ని కంపెనీ మాత్రం వెల్లడించలేదు. సంవత్సరం పూర్తి కానున్నడంతో పెండింగ్ జాబితాను క్లియర్ చేసుకోవడానికి ఈ చర్యలు తీసుకుందని భావిస్తున్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్ జీ మోటారు సైకిల్ మూడు రకాల వేరియంట్లలో విడుదలైంది. వాటికి డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అని పేర్లు పెట్టారు. వీటిలోని మొదటి రెండు వేరియంట్లకు ధరలను కంపెనీ తగ్గించింది. డ్రమ్ వేరియంట్ ధర రూ.95 వేలు కాగా, దానిపై రూ.5 వేలు తగ్గించి, రూ.90 వేలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. డ్రమ్ ఎల్ఈడీ రూ.1.05 లక్షలు కాగా, దానిపై రూ.పదివేల తగ్గింపు ప్రకటించింది. దీంతో బండి రూ.95 వేలకు అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.

ఈ మోటారు సైకిల్ సీటు కింద సీఎన్ జీ ట్యాంక్ అమర్చారు. దీనిలో పాటు 125 సీసీ పెట్రోలు ఇంజిన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్ నుంచి 9.4 బీహెచ్ పీ, 9.7 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఈ బైక్ సీఎన్జీతో నడిచేటప్పుడు కేజీ కి 102 కిలోమీటర్లు, పెట్రోలు తో నడిచినప్పుడు 64 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం సీఎన్ జీతో నడిచే కార్లు చాలా అందుబాటులో ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ తో పోల్చితే వీటికి నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య ఉద్గారాలు విడుదల కావు. దీంతో చాలామంది ఈ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే మాదిరిగా బజాజ్ ఆటో నుంచి ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ విడుదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి